మన కల్లూ కల్తీనే! | - | Sakshi
Sakshi News home page

మన కల్లూ కల్తీనే!

Jul 19 2025 3:58 AM | Updated on Jul 19 2025 3:58 AM

మన కల

మన కల్లూ కల్తీనే!

ఎకై ్సజ్‌ చర్యలు..

కూకట్‌పల్లి ఘటన తర్వాత జిల్లాలో ఎకై ్సజ్‌ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 48 శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల్లో 4 కల్తీ కల్లు కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్‌ చేశారు. అనుమతి లేకుండా అక్రమంగా కల్లు విక్రయిస్తున్న 16 మందిపై కేసులు నమోదు చేశారు. చిట్యాల్‌ దాడిలో స్వాధీనం చేసుకున్న క్లోరల్‌ హైడ్రేట్‌, ఆల్ఫ్రాజోలం కేసులో ఐదుగురిని రిమాండ్‌ చేయడంతోపాటు రెండు కార్లను సీజ్‌ చేశారు. అయినప్పటికీ, తనిఖీలు సంతృప్తికరంగా లేనందున, కల్తీ కల్లు విక్రయాలు కొనసాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

ఖానాపూర్‌: జిల్లాలో తాటి, ఈత చెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయినా కల్లు మాత్రం ఊరూరా లభిస్తోంది. ఇంత కల్లు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరూ ఆలోచించడం లేదు. దీంతో చెట్ట కల్లు స్థానంలో చేతికల్లు రాజ్యమేలుతోంది. ఇటీవల ఎక్సైజ్‌ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్మల్‌ రూరల్‌ మండలం చిట్యాల్‌లో కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే నిషేధిత రసాయనం క్లోరల్‌ హైడ్రేట్‌(సీహెచ్‌), ఆల్ఫ్రాజోలం పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎకై ్సజ్‌ అధికారులను కాదని, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ నేరుగా రంగంలోకి దిగడం స్థానిక అధికారుల పనితీరుకు నిదర్శనం. గతంలో కూడా కల్తీ కల్లు తాగి ఆస్పత్రి పాలైన ఘటనలు ఉన్నాయి. ఇక తాజాగా కూకట్‌పల్లిలో కల్తీకల్లు తాగి 9 మంది మరణించడంతో జిల్లా ఉలిక్కిపడింది.

చెట్టు కల్లు స్థానంలో చేతి కల్లు..

సహజంగా తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే కల్లు జిల్లాలోని కల్లు తయారీ కేంద్రాలు, కల్లు దుకాణా లు, కల్లు వనాలు, కంపౌండ్‌లలో అమ్మకాలు జరగాలి. అయితే, దీనికి విరుద్ధంగా సహజ కల్లుకు బదులు క్లోరల్‌ హైడ్రేట్‌, ఆల్ఫ్రాజోలం వంటి నిషేధిత మత్తు పదార్థాలను కలిపి కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ రసాయనాలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించేవారు. తాజా దాడుల్లో నిర్మల్‌ జిల్లాలోనే చిట్యాల్‌ వద్ద ఓ వ్యవసాయ క్షేత్రంలో గుట్టుచప్పుడు కాకుండా క్లోర ల్‌ హైడ్రేట్‌ తయారు చేస్తుండడం ఈ దందా ఏమేరకు సాగుతోందో తెలియజేస్తుంది. ముంబైలోని భీవండి నుంచి ‘క్లోరో’ అనే ద్రవ పదార్థాన్ని తెప్పించి, దానిని గడ్డకట్టించి క్లోరల్‌ హైడ్రేట్‌గా మార్చుతున్నారు. ఈ దాడిలో 425 కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌, 10 కిలోల ఆల్ఫ్రాజోలంతోపాటు ఈ కల్తీ దందాకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

జోరుగా కల్తీ కల్లు అమ్మకాలు..

జిల్లాలో 23 కల్లు సొసైటీలు, 99 కల్లు దుకాణాలు ఉన్నాయి. ఈ వాటి నిర్వహణపై ఎకై ్సజ్‌ అధికారులు తగిన దృష్టి సారిస్తున్నారా అనే అనుమానాలు జనంలో నెలకొన్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలసిన బెల్ట్‌ షాప్‌లలో లూజ్‌ విక్రయాల పేరుతో కల్తీ కల్లు అమ్మకాలు జరుగుతున్నాయని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ, అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఖానాపూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌లో బెల్ట్‌ షాప్‌లు, తెల్ల కల్లు దుకాణాలు, గుడుంబా విక్రయాలను అరికట్టాలని స్థానికులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా, ఫలితం కనిపించడం లేదు.

నిరంతరం తనిఖీలు..

జిల్లాలోని కల్లు సొసైటీలతోపాటు కల్లు దుకాణాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి నిరంతరం తనిఖీలు చేస్తున్నాం. 4 కల్తీ కల్లు కేసులను సైతం నమోదు చేయడంతోపాటు అక్రమంగా కల్లు విక్రయిస్తున్న 16 మందిపై కేసులు పెట్టి రిమాండ్‌ చేశాం. ఇటీవల టాస్క్‌ఫోర్స్‌తో కలిసి దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున క్లోరల్‌ హైడ్రేట్‌, ఆల్ఫ్రాజోలం పట్టుకున్నాం. బెల్ట్‌ దుకాణాలతోపాటు గుడుంబా స్థావరాలు, బెల్లం పటిక విక్రయాలపై చర్యలు తీసుకుంటున్నాం.

– ఎండీ.రజాక్‌, డీపీఈవో, నిర్మల్‌

కనుమరుగవుతున్న తాటిచెట్లు.. పెరుగుతున్న చేతికల్లు

ఇటీవల జిల్లాలో పెద్ద ఎత్తున పట్టుబడ్డ క్లోరల్‌ హైడ్రేట్‌

కూకట్‌పల్లి ఘటనతో ఉలికిపాటు

మన కల్లూ కల్తీనే!1
1/1

మన కల్లూ కల్తీనే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement