
మాట నిలబెట్టుకోని కాంగ్రెస్
● ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకష్ణ మాదిగ ● జిల్లా కేంద్రంలో వికలాంగుల మహా గర్జన సదస్సు
నిర్మల్‌టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం వికలాంగుల చేయూత పింఛన్‌దారుల మహా గర్జన సన్నాహ క సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మందకృష్ణ హాజరై మాట్లాడారు. పింఛన్‌దారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. గద్వాల నుంచి మొదలైన ఈ సభలు వచ్చే నెల 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు. 20 నెలల్లో వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు రూ.40 వేలు నష్టపోయారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కాలం వెల్ల్లదీస్తోందని మండిపడ్డారు. ఇప్పటికై నా వికలాంగులకు పెన్షన్ రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు, డయాలసిస్, హెచ్‌ఐవీ రోగులకు రూ.4 వేలు, కండరాల క్షీణిత కలిగిన వారికి రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 13న హైదరాబాద్‌లో పింఛన్‌దారుల మహా గర్జన సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వికలాంగు ల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, వీహెచ్‌పీఎస్ నాయకులు రాజేశ్వర్, వినోద్, భూమేష్, లత, పోసాని, కళావతి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి శ్రీను, ఎంఎస్‌పీ కోఆర్డినేటర్ శనిగారపు రవి పాల్గొన్నారు.