
నిర్మల్
‘నానో’నే నయం
ఖరీఫ్ సాగు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. యూరియా కొరత రైతులను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో నానో యూరియా వాడాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
బాసరకు అమాత్యుల క్యూ..
● ఆరు రోజుల వ్యవధిలో ముగ్గురు మంత్రుల రాక.. ● అభివృద్ధిపై స్థానికుల్లో చిగురిస్తున్న ఆశలు ● అమ్మవారి ఆలయం, ట్రిపుల్‌ఐటీ గతి మారేనా..?
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025
23న విద్యాసంస్థల బంద్
నిర్మల్‌టౌన్: D¯ðlÌS 23¯]l ÐéÐ]l$-糄ýS ѧéÅ-Ǧ çÜ…çœ*ÌS B«§ýlÓ-Æý‡Å…ÌZ Æ>çÙ‰-ÐéÅ-ç³¢…V> ´ëuý‡-Ô>-ÌS-Ë$, þ°Ä¶æ$ÆŠ‡ MýSâêÔ>-ÌSÌS º…§Šæ °Æý‡Ó-íßæ-çÜ$¢-¯]l²r$Ï ÐéÐ]l$-糄ýS ѧéÅ-Ǧ çÜ…çœ*ÌS ¯éĶæ$-MýS$-Ë$ ™ðlÍ´ëÆý‡$. hÌêÏ MóS…{§ýl…ÌZ° I½ VðS‹Üt-çßo-‹ÜÌZ ѧéÅ-Ǧ çÜ…çœ*ÌS ¯éĶæ$-MýS$-Ë$ çÜÐ]l*-ÐólÔèæ… Ô¶æ${MýS-ÐéÆý‡… °Æý‡Ó-íßæ…^éÆý‡$. M>…{VðS-‹Ü {糿¶æ$-™èlÓ… {Oò³Ðólr$, M>Æöµ-Æó‡sŒæ ѧéÅ-çÜ…-çܦ-ÌZÏ ïœkÌS °Ä¶æ$…-{™èl-׿ ^èlrt… ¡çÜ$-MöÝë¢-Ð]l$° ^ðlí³µ °Æý‡Ï-„ýSÅ… ^ólíÜ…§ýl-¯é²Æý‡$. RêäV> E¯]l² sîæ^èl-ÆŠæ, G…DÐø, yîlDÐø ´ùçÜ$t-ÌS¯]l$ ¿ýæÈ¢ ^ólĶæ*-ÌS-¯é²Æý‡$. ò³…yìl…VŠæ ÝëPÌS-ÆŠæḥíÙ‹³Ë$ Ñyýl$-§ýlÌS ^ólĶæ*-ÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. hÌêÏ-ÌZ° {糿¶æ$™èlÓ M>Æöµ-Æó‡sŒæ {Oò³ÐólsŒæ ´ëuý‡-Ô>-ÌS-Ë$, þ°Ä¶æ$ÆŠ‡ MýSâêÔ>-ÌSÌS Ķæ$fÐ]l*-¯éÅ-Ë$ çÜÓ^èle…§ýl…-V> º…§Šæ ^ólĶæ*-ÌS° í³Ë$ç³#-°^éaÆý‡$. çÜÐ]l*-Ðól-Ôèæ…-ÌZ ï³yîl-G‹ÜĶæÊ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$ íÜ…V>Ç Ððl…MýS-sôæÔŒæ, HIG‹Ü½ Æ>çÙ‰ A«§ýlÅ-„ýS$yýl$ Æ>çßæ$ÌŒæ, G‹ÜG‹œI hÌêÏ MýS±Ó¯]lÆŠ‡ ¨VýS…-ºÆŠæ, HIG‹ÜG‹œ hÌêÏ MýS±Ó¯]lÆŠ‡ OMð Ìê‹Ù ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.
భైంసా: బాసర, తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక, విద్యా కేంద్రం. ఈ క్షేత్రానికి ఆరు రోజుల వ్యవధిలో ముగ్గురు మంత్రుల రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ గత శనివారం బాసరను సందర్శించారు. తాజాగా గురువారం అర్ధరాత్రి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ట్రిపుల్‌ఐటీకి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలు బాసర అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తున్నాయి.
అధికారులతో సమీక్ష సమావేశాలు
మంత్రి శ్రీధర్‌బాబు అమ్మవారి దర్శనం అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిలతో కలిసి బాసర అభివృద్ధి, అమ్మవారి ఆలయ అభివృద్ధి, ట్రిపుల్‌ఐటీ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్రిపుల్‌ఐటీ వసతి గృహంలో అధికారులతో చర్చలు జరిపారు.
గత నిధుల వివాదం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బాసర అభివృద్ధిపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసినప్పటికీ, కేవలం రూ.8 కోట్లు ఖర్చు చేసి, మిగిలిన రూ.42 కోట్లను వెనక్కి తీసుకుంది. ఈ నిధులను తిరిగి విడుదల చేయాలని స్థానిక నాయకులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు, కానీ ఫలితం కనిపించలేదు.
ఆలయం చుట్టూ రాజకీయం..
బాసర ఆలయం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, నిధులు మంజూరు చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని, భిక్షమెత్తయినా గర్భగుడిని తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మంత్రులు కొండా సురేఖ, గడ్డం వివేక్ కేంద్ర ప్రభుత్వం బాసర అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్రం గుర్తించడం లేదని విమర్శించారు. అదే సమయంలో, బీఆర్‌ఎస్ నాయకులు గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసిందని, భిక్షమెత్తే మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు మాత్రం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బాసరకు రూ.50 కోట్లు మంజూరు చేసి, తిరిగి వెనక్కి తీసుకుందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య బాసర అభివృద్ధి విషయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.
మూడు రోజులు తపాలా
సేవలకు అంతరాయం
ఖానాపూర్: తపాలా సేవల్లో నూతన సాఫ్ట్‌వేర్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తపాలా సేవలకు మూడు రోజులు అంతరాయం కలగనుందని నిర్మల్ సబ్ డివిజన్ పోస్టల్ అధికారి సందీప్ తెలిపారు. ఈ నెల 19 నుంచి 21 వరకు తపాలా సేవలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. నియోగదారులు, ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. తపాలా సేవలన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించేలా తపాలా శాఖ చర్యలు చేపడుతుందని తెలిపారు.
చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
న్యూస్‌రీల్
భవిష్యత్తు ఏమిటి?
బాసరకు ఆలయం, ట్రిపుల్‌ఐటీలతో ప్రత్యేక స్థానం ఉంది. జిల్లా అధికారులు ఆలయ మాస్టర్ ప్లాన్, ట్రిపుల్‌ఐటీ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు గడ్డిగారి విఠల్‌రెడ్డి, బోస్లే నారాయణరావు పటేల్, వేణుగోపాలచారి అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని కలుస్తున్నారు. మంత్రి కొండా సురేఖ గత శనివారం ఆలయ అభివృద్ధి కోసం నాలుగు విభాగాలుగా చేపట్టే పనులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మొత్తానికి మంత్రుల పర్యటనలతో బాసర అభివృద్ధి ఊపందుకుంటుందా, లేక గతంలోలా గాలికి వదిలేస్తారా అన్న ప్రశ్న స్థానికులను వెంటాడుతోంది. అమ్మవారి ఆలయం, ట్రిపుల్‌ఐటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలపై అందరి దృష్టి నెలకొంది.

నిర్మల్