
వర్సిటీకి విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు
బాసర: బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)కి అందులో చదువుతున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం వర్సిటీని సందర్శించారు. వీసీ ఛాంబర్‌లో అధికారులు, బోధన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రవేశాల ప్రక్రియ, అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో ముఖాముఖి..
అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. భోజనశాల విస్తరణ, పరి శుభ్రత, వసతి గృహాల నిర్వహణపై సూచనలు చేశారు. రూ.3.20 లక్షలతో ఏర్పాటవుతున్న ‘ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్’లను పరిశీలించారు.
పుష్కర ఘాట్ల పరిశీలన..
అనంతరం కలెక్టర్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గోదావరి నది పుష్కర ఘాట్లను పరిశీలించిన కలెక్టర్ భక్తుల భద్రత కోసం జాలీలు, ఇనుప స్తంభాలతో చైన్లు ఏర్పాటు చేయాలన్నారు. 100 రూముల అతిథి గృహం, నూతన దేవస్థానం కార్యాలయ భవనాన్ని తనిఖీ చేశారు. ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్, ఆలయ ఈవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో అశోక్ కుమార్, ఎంపీవో గంగాసింగ్, ప్రసాద్‌గౌడ్ పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
ట్రిపుల్ ఐటీ సందర్శన
విద్యార్థులతో ముఖాముఖి

వర్సిటీకి విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు