
అమ్మ కొలువుదీరేదెప్పుడో..
సారంగపూర్: జిల్లాలోని అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటి అడెల్లి మహాపోచమ్మ ఆలయం రూ.6.60 కోట్ల నిధులతో కృష్ణ శిలలతో పునర్నిర్మించారు. నిర్మాణం పూర్తయి నాలుగు నెలలు గడిచినా అమ్మవారి ప్రతి ష్టాపన కార్యక్రమం నిర్వహించడం లేదు. పునర్నిర్మాణ సమయంలో అమ్మవారిని బాలాలయంలోకి తరలించారు. ఇప్పటికీ ఆ ఆలయంలోనే అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నారు. ఇరుకైన బాలాలయంలో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. మొన్నటి వరకు పాలకమండలి లేక ఆలయ ప్రారంభోత్సవం ఆగిపోయింది. ఇప్పుడు పాలకమండలి కొలువుదీరినా ఆలయాన్ని ప్రారంభించకపోవడంపై భక్తులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బాలాలయంలో ఇబ్బంది..
గత ఏప్రిల్ 25న అడెల్లి మహాపోచమ్మ ఆలయ పా లకమండలి ఏర్పాటైంది. మూడు నెలలు గడిచినా నూతన ఆలయ ప్రారంభోత్సవం జరగలేదు. ప్రతీ ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి, ఇరుకై న బాలాలయంలో అమ్మవారి దర్శనానికి ఇబ్బంది పడుతున్నారు.
సమీపిస్తున్న గంగనీళ్ల జాతర..
సెప్టెంబరు 27, 28 తేదీల్లో గంగనీళ్ల జాతర నిర్వహించనున్నారు. జాతర సమీపిస్తున్నా ప్ర ధాన ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాప న, ఆలయ ప్రారంభోత్సవానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నూతన ఆలయం ప్రా రంభోత్సవానికి 60 నుంచి 70 రోజుల సమ యం పడుతుందని అర్చకులు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఈ నెలలోనే ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు.
చర్చించి నిర్ణయిస్తాం..
ఆలయ పాలకవర్గం విషయంలో జాప్యం కారణంగానే ప్రారంభోత్సవం ఆలస్యమైంది. ఇటీవలే పాలకవర్గం కొలువుదీరింది. పాలకమండలి సమావేశంలో ఆలయ ప్రారంభోత్సవంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈవిషయంలో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు, పాలక మండలి నిర్ణయం ప్రకారమే ప్రారంభోత్సవం నిర్వహిస్తాం.
– రమేశ్, ఈవో, అడెల్లి మహాపోచమ్మ ఆలయం
అడెల్లి ఆలయ నిర్మాణం పూర్తి..
విగ్రహ ప్రతిష్టాపనలో జాప్యం
ప్రొటోకాల్ ప్రతిబంధకం..?
పాలకవర్గం చొరవ చూపితేనే..

అమ్మ కొలువుదీరేదెప్పుడో..