
బోనస్ ఎప్పుడో..?
నిర్మల్
డిగ్రీలో బంగారు పతకాలు
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ బయో టెక్నాలజీ పూర్తి చేసిన గుర్రం శ్రావ్య రెండు బంగారు పతకాలు సాధించింది. కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో బీఎస్పీ విభాగంలో ఒకటి, కెమిస్ట్రీ విభాగంలో మరో బంగారు పతకం సాధించింది. సోమవారం వరంగల్‌లో నిర్వహించిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా పతకాలను అందుకున్నారు.
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025
ఈవీఎం గోదాం తనిఖీ
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ రూరల్ మండలం ఎల్ల పల్లి వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ సోమవారం తనిఖీ చేశారు. తాళం సీల్, సీసీ కెమెరాలో రికార్డు దృశ్యాలను పరిశీలించారు. తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. వారివెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు గజానంద్, సిబ్బంది రాజశ్రీ ఉన్నారు.
లక్ష్మణచాందకు చెందిన రైతు కంతి చిన్న రాజేశ్వర్ యాసంగిలో పదెకరాల్లో సన్నరకం వరి పండించాడు. 200 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాడు. కేంద్ర నిర్వాహకులు సన్నవడ్లుగా నమోదు చేశారు. అయితే ధాన్యం మద్దతు ధరకు సంబంధించిన డబ్బులు ఆయన ఖాతాలో జమయ్యాయి. బోనస్ డబ్బులు మాత్రం రాలేదు. రూ.లక్ష రావాల్సి ఉంది. త్వరగా చెల్లిస్తే వానాకాలం పెట్టుబడికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నాడు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు లోడ్ చేస్తున్న హమాలీలు(ఫైల్)
లక్ష్మణచాంద: రాష్ట్రంలోని రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ అందిస్తోంది. వానాకాలం సీజన్ నుంచి ఈ బోనస్‌ను ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో యాసంగి సీజన్‌లో కూడా సన్నరకం వరినే జిల్లా రైతులు సాగుచేశారు.
రికార్డు స్థాయిలో ధాన్యం..
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 318 కొనుగోలు కేంద్రాల ద్వారా 42,032 మంది రైతుల నుంచి మొత్తం 1,81,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించారు. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో సుమారు 22 వేల మెట్రిక్ టన్నులు అధిక ధాన్యం సేకరణ జరిగినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. ఇందులో 1,55,377 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం వరి ధాన్యం కాగా, 25,623 మెట్రిక్ టన్నులు సన్న రకం వరి ధాన్యం. ఈ సేకరణకు ఇప్పటివరకు రూ.419.66 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
బోనస్ ఆలస్యం..
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 4,483 మంది రైతుల నుంచి 25,623 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం సేకరించారు. ఈ ధాన్యానికి సంబంధించిన మొత్తం డబ్బులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. అయితే క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ మాత్రం ఇంకా చెల్లించలేదు. ఈ బోనస్ కింద 4,483 మంది రైతులకు రూ.12.81 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి నెల రోజులైనా బోనస్ చెల్లింపులలో జాప్యంపై రైతులు నిరాశ చెందుతున్నారు.
న్యూస్‌రీల్
కొనుగోళ్లు పూర్తయి
నెల దాటినా జమకాని డబ్బులు
త్వరగా చెల్లించాలని కోరుతున్న రైతులు
జిల్లాకు రూ.12.81 కోట్లు పెండింగ్
త్వరగా జమ చేయాలి..
యాసంగిలో సన్న వడ్లే సాగు చేశాను. 60 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఐకేపీ కేంద్రంలోనే విక్రయించాను. బోనస్ డబ్బులు మాత్రం ప్రభుత్వం చెల్లించలేదు. వానాకాలం పెట్టుబడికి తిప్పలైతాంది. త్వరగా బోనస్ జమ చేయాలి.
– కట్కం నవీన్, లక్ష్మణచాంద
త్వరలో ఖాతాల్లోకి..
సన్నరకం వరి ధాన్యం సాగుచేసిన రైతులకు ఇచ్చే బోనస్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు త్వరలోనే నేరుగా జమ అవుతాయి.
– సుధాకర్, డీఎం పౌరసరఫరాల శాఖ
జిల్లా సమాచారం...
జిల్లాలో సేకరించిన వరి ధాన్యం
1,81,000 మెట్రిక్ టన్నులు
దొడ్డు రకం ధాన్యం
1,55,377 మెట్రిక్ టన్నులు
సన్న రకం ధాన్యం 25,623 మెట్రిక్ టన్నులు
మొత్తం రైతులు 42,032 మంది
చెల్లించిన డబ్బులు రూ.419.66 కోట్లు
బోనస్ రావాల్సిన రైతులు 4,483 మంది
రావాల్సిన బోనస్ డబ్బులు రూ.12.81 కోట్లు

బోనస్ ఎప్పుడో..?

బోనస్ ఎప్పుడో..?