కాలువలకు మరమ్మతు | - | Sakshi
Sakshi News home page

కాలువలకు మరమ్మతు

Jul 8 2025 7:04 AM | Updated on Jul 8 2025 7:04 AM

కాలువ

కాలువలకు మరమ్మతు

కడెం: జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు అయిన కడెం, సదర్మాట్‌ ఆయకట్టు కాలువల నిర్వహణను గత ప్రభుత్వాల నిర్లక్ష్యం చేశాయి. దీంతో సాగునీటి కాలువలు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. చాలా వరకు రెండో పంట పండక రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రతీ వర్షాకాలం ముందు కాలువల్లో పొదల తొలగింపు, పూడికతీత, మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ, నిధుల కొరతతో ఈ పనులు చేపట్టలేదు. ఫలితంగా, కాలువల ఆనవాళ్లు కోల్పోయి, నీటి ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొంది.

నిధుల కేటాయింపుతో పనులు..

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి, కడెం ఎడమ కాలువ, సదర్మాట్‌ కాలువల మరమ్మతుల కోసం నిధులు కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ఈ పనులను ప్రారంభించి, వేగవంతంగా పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. వర్షాకాల సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో, ఇరిగేషన్‌ అధికారులు మరమ్మతు పనులను త్వరితగతిన చేపడుతున్నారు.

కడెం కాలువకు రూ.42.40 లక్షలు..

కడెం ఎడమ కాలువ మరమ్మతుల కోసం రూ.42.40 లక్షలు కేటాయించగా 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో పనులు జరుగుతున్నాయి. పొదల తొలగింపు, చెత్తాచెదారం (సిల్ట్‌) శుభ్రపరచడం, కాలువ కట్టల బలోపేతం వంటి పనులు చేపడుతున్నట్లు కడెం ఎడమ కాలువ ఏఈఈ మురళి తెలిపారు.

సదర్మాట్‌ కాలువకు రూ.34.55 లక్షలు..

సదర్మాట్‌ కాలువకు రూ.34.55 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. 21.5 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. పొదల తొలగింపు, పూడికతీత, దెబ్బతిన్న కాలువ మరమ్మతులు, అవసరమైన చోట్ల కాలువ ఎత్తు పెంచడం వంటి చర్యలు చేపడుతున్నట్లు సదర్మాట్‌ కాలువ ఏఈఈ విశాల్‌ వెల్లడించారు.

సమస్య పరిష్కారం..

ఈ మరమ్మతు పనులతో కడెం, సదర్మాట్‌ ఆయకట్టు ప్రాంతాల్లో సాగునీటి సమస్య తీరి, చివరి ఆయకట్టు వరకు నీరు అందే అవకాశం ఉంది. రైతులు ఈ చర్యలను స్వాగతిస్తూ, వర్షాకాల సీజన్‌లో పంటల సాగుకు అవసరమైన నీటి సరఫరా సజావుగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరమ్మతులు చేయిస్తున్నాం

ఇటీవలే ప్రభుత్వం కాలువల మరమ్మతులకు నిధులు విడుదల చేసింది. కడెం ఎడమ కాలువతోపాటు, సదర్మాట్‌ కాలువ మరమ్మతు పనులు ప్రారంభించాం. కాలువల్లో పూడికతీత, పొదల తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో పంటకు కూడా ఇబ్బంది ఉండదు.

– విఠల్‌, ఈఈ

రైతులకు అండగా..

గత ప్రభుత్వం కడెం ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చినమాట ప్రకారం కడెం రైతాంగానికి అండగా నిలిచింది. అధికారంలో రాగానే 9.26 కోట్లతో ప్రాజెక్ట్‌ మర్మమతులు పూర్తి చేయించింది. కడెం, సదర్మాట్‌ కాలువల మరమ్మతులకు నిధులు కేటాయింది.

– పొద్దుటూరి సతీశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు

ఏళ్లుగా పట్టించుకోని పాలకులు..

చాలావరకు ఆనవాళ్లు కోల్పోయిన వైనం..

కడెం, సదర్మాట్‌కు నిధులు కేటాయించిన ప్రభుత్వం

మరమ్మతులు చేయిస్తున్న ఇరిగేషన్‌ అధికారులు

సాగునీటి సమస్యకు పరిష్కారం

కాలువలకు మరమ్మతు1
1/3

కాలువలకు మరమ్మతు

కాలువలకు మరమ్మతు2
2/3

కాలువలకు మరమ్మతు

కాలువలకు మరమ్మతు3
3/3

కాలువలకు మరమ్మతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement