● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న కలెక్టర్‌ ● గ్రీవెన్స్‌కు 91 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న కలెక్టర్‌ ● గ్రీవెన్స్‌కు 91 దరఖాస్తులు

Jul 8 2025 7:04 AM | Updated on Jul 8 2025 7:04 AM

● ప్ర

● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష

మేడం.. దయచూపండి!

నిర్మల్‌చైన్‌గేట్‌: ‘మా సమస్యను పట్టించుకునేవారు కరువయ్యారు.. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం కావడం లేదు.. మేడం మీరైనా దయచూపండి’ అని ప్రజావాణిలో పలువురు అర్జీదారులు కలెక్టర్‌ను వేడుకున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 91 అర్జీలు వచ్చాయి అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారులను గౌరవిస్తూ వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు.

సమన్వయంతో పనిచేయాలి..

సంక్షేమ పథకాలు అమలులో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. భూభారతి చట్ట అమలుపై తహసీల్దార్లు పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వనమహోత్సవంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ అధ్యక్షతన త్వరలో నిర్వహించే దిశ కమిటీ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈనెల 9న జిల్లా కేంద్రంలో ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సులు ఉంటుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో ఇంటర్నల్‌ కంప్లెయింట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశాల ప్రకారం ప్రతీనెల 30వ తేదీన సివిల్‌ రైట్స్‌ దినోత్సవాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్‌ అహ్మద్‌, కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు..

మాది నిర్మల్‌ రూరల్‌ మండలం కౌట్ల(కె). నాకు నలుగురు సంతానం. గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. గ్రామానికి చెందిన మురుగు నీటిని గ్రామా పంచాయతీ కార్యదర్శి, మరో ఇద్దరితో కలిసి మా భూమిలోకి మళ్లించాడు. దీనిని ప్రశ్నించినందుకు నన్ను పంచాయతీ కార్యాలయనికి పిలిచి రూ.40 వేల జరిమానా దౌర్జన్యంగా కట్టించుకున్నారు. జరిమానా గురించి ఎవరికై నా తెలిపితే రూ.50 వేలు, మురుగు నీటి కాలువపై ఫిర్యాదు చేస్తే రూ.లక్ష జరిమానా విధిస్తానని బెదిరిస్తున్నాడు. ఆయన అనుచరులుగా ఉన్న ఇద్దరు మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

– బైకస్‌ చిన్నయ్య కుటుంబ సభ్యులు

భూ ఆక్రమణలు ఆపాలి

మేము లోకేశ్వరం మండలం భామిని గ్రామస్తులం. మా గ్రామంలోని ఎర్రకుంట, భుర్కుంటతోపాటు గ్రామ కంఠం భూములను కొందరు ఆక్రమించుకున్నారు. ఇదే విషయమై తహసీల్దార్‌, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. మీరైనా స్పందించి భూ కబ్జాలు ఆపాలి.

– భామ్ని గ్రామస్తులు, లోకేశ్వరం మండలం

ఆ స్కూళ్లను మూసివేయాలి..

జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలను వెంటనే రద్దు చేయాలి. ఐదేళ్లుగా కొన్ని పాఠశాలల్లో ఎలాంటి అనుమతి లేకుండానే 7వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నాయి. ఈ విషయంపై డీఈవోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మీరైనా అనుమతి లేని పాఠశాలలను మూసివేయండి

– ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యం, నిర్మల్‌

పట్టా చేయడం లేదు..

మా మామయ్యకు ముగ్గురు కుమారులు. చామన్‌పల్లి గ్రామం తిరుపెల్లి శివారులో 185/15,185/5,185/14/ఆ, 185/4/1, 184/1/ఆ తోపాటు మరో కొన్ని సర్వే నంబర్లలో 22 సంవత్సరాల క్రితం పలువురి వద్ద 8 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ భూములు వేరేవారి పేరు మీద రిజిస్టర్‌ అయినట్టు చూపిస్తున్నాయి. మా భూమి మాకు ఇప్పించండి.

– బడ్డారి పెద్దలింగన్న కోడళ్లు,

చామన్‌పల్లి, లక్ష్మణచాంద

● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష1
1/4

● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష

● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష2
2/4

● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష

● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష3
3/4

● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష

● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష4
4/4

● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement