
తహసీల్దార్‌ను బదిలీ చేయండి
లోకేశ్వరం: మండలానికి కొత్తగా వచ్చిన తహసీల్దా ర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను వెంటనే బదిలీ చేయాలని మండలంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చేవారితో తహసీల్దార్ అమర్యాదగా వ్యవహరిస్తున్నారని, ఇబ్బంది పెడుతున్నాడని ఆ రోపించారు. తహసీల్దార్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రవర్త న సరిగా లేదని బీజేపీ మండల కన్వీనర్ బొడికె సా యన్న, కాంగ్రెస్ కన్వీనర్ సుదర్శన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ కన్వీనర్ శ్యాంసుందర్ పేర్కొన్నారు. ఈమేరకు ము ధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు లోకేశ్వ రం రైతువేదికలో సోమవారం వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే వారం రోజుల్లో తహసీల్దార్ బదిలీ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చినవారిలో వివిధ పార్టీల నాయకులు కపిల్, భుజంగరావు, చిన్నారావు, భోజన్న, శంకర్‌గౌడ్, రత్నాకర్‌రావు, గన్ను నర్సారెడ్డి ఉన్నారు.