
నిర్మల్ ఐటీఐకి ఎక్స్‌లెన్స్ అవార్డు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఐటీఐ రాష్ట్రంలోనే ఉత్తమ కళాశాలగా ఎక్స్‌లె న్స్ అవార్డు అందుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉత్తమ కళాశాలగా ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం పురస్కారాన్ని ప్రిన్సి పాల్ కృష్ణమూర్తికి ప్రదానం చేశారు. జిల్లా కేంద్రంలో ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసి న రాజీవ్‌గాంధీ ఐటీఐ ఎంతో మంది యువతీ, యువకులకు, ఉద్యోగ, స్వయం ఉపాధి కోర్సులు అందించిందని, ఉపాధి కల్పనకు దోహదపడిందని ప్రిన్సిపాల్ వివరించారు.