
‘కోట’ మరణం తీరని లోటు
నిర్మల్‌ఖిల్లా: సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ‘పాటే మా ప్రాణం’ సంస్థ కార్యవర్గ సభ్యులు కొనియాడారు. ఆదివారం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కా ర్యక్రమంలో కోట మృతికి సంతాపం తెలిపా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాదాపు 700కు పైగా చి త్రాల్లో కమెడియన్‌గా, విలన్‌గా క్యారెక్టర్ ఆ ర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించి తనదైన శైలి తో ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు చెనిగారపు నా గరాజు, కళాకారులు నేరెళ్ల హనుమంతు, రమణ, వేణుగోపాల్‌వర్మ తదితరులున్నారు.