
గౌతమ బుద్ధుని బోధనలు అనుసరణీయం
తానూరు: గౌతమ బుద్ధుని బోధనలు అనుసరించాలని భారతీయ బౌద్ధమహాసభ జిల్లా అ ధ్యక్షుడు రమేశ్‌బాబు వాగ్మారే సూచించారు. మండల కేంద్రంలోని బుద్ధవిహార్‌లో ఏర్పాటు చేసిన వర్షవాజ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బుద్ధుని చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. అంబేడ్కర్ సూచించి న 22 ప్రతిజ్ఞలను అనుసరించాలని తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధుని చరిత్ర వివరించారు. కా ర్యక్రమంలో భారతీయ బౌద్ధమహాసభ నాయకులు సురేకాంత్ పవార్, సాయినాథ్ బద్రే, భీంపవార్, అంబాదాస్ పవార్, రమేశ్ పవార్, ఆయా మండలాల భారతీయ బౌద్ధమహాసభ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.