
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఇచ్చోడ: మండల కేంద్రానికి చెందిన జాదవ్ దేవి దాస్ (42) సోమవారం మధ్యాహ్నం అదృశ్యం కాగా మంగళవారం మృతదేహం లభ్యమైనట్లు సీఐ బండారి రాజు తెలిపారు. కిరాణ దుకాణానికి వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి ఇంటికి రాకపోయేసరికి అతని భార్య వనిత ఇచ్చోడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మంగళవారం టీటీడబ్ల్యూఆర్‌జేసీ ప్రహరీ పక్కన మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. పురుగుల మందు తాగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఆరోగ్య పరిస్థితి సరిగాలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు.