
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తానూరు: మండలంలోని బోంద్రట్‌లో ఈ నెల 13న పట్టపగలు గ్రామానికి చెందిన జగ్మే సవిత్రిబాయి, నారాయణ్ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సోన్‌కాంబ్లె రాహుల్ ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి రూ.70 నగదు, పదమూడున్నర గ్రాముల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల వెండి దొంగిలించాడు. బోంద్రట్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని హైవే పక్కన పొదలో గుంతతవ్వి అందులో దాచి పెట్టాడు. ఎస్సై షేక్ జుబేర్ నిందితుడిని వేలిముద్రల ఆధారంగా పట్టుకున్నాడు. నిందితుని వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు.