
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసాటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఓవైసీనగర్‌కు చెందిన షేక్ అహ్మద్, బంగాలగల్లీకి చెందిన సుల్తాన్ ఖాన్ స్థానిక గాంధీగంజ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై నవనీత్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 2.5 కిలోల ఎండు గంజాయి లభించినట్లు వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరిపై గతంలోనూ గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైందన్నారు. సమావేశంలో సీఐ జి గోపీనాథ్, ఎస్సై నవనీత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ అవినాష్‌కుమార్