
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
సారంగపూర్: నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దుర్గానగర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించే పాఠశాల భవనం పనులను సోమవారం ప్రారంభించారు. అనంతరం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 123 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో రోడ్లు లేని గిరిజన గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్నిరంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంటానని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా తన ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు తాను సదా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, కాల్వ నరేశ్, సామల వీరయ్య, చంద్రప్రకాశ్‌గౌడ్, గంగారెడ్డి, విలాస్, తిరుమలాచారి, రాజేశ్వర్, నారాయణ, కొరిపెల్లి రాజు, ప్రకాశ్, డీఈ తుక్కారాం, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఎంపీవో అజీజ్‌ఖాన్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి