
రోగులకు మెరుగైన వైద్యం
మామడ/సోన్: రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో రాజేందర్ అన్నారు. మామడ, సోన్ మండలం న్యూవెల్మల్ బొప్పారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. పీహెచ్‌సీ రికార్డులను పరిశీలించారు. వర్షాలు పడుతున్నందున వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శిబిరాల ను నిర్వహించి చికిత్స అందించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం భవనం మరమ్మతులకు అవసరమైన వివరాల గురించి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా వారంలో రెండుసార్లు డ్రైడే పక్కాగా నిర్వహించాలన్నారు. దోమల వృద్ధిని అడ్డుకోవాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని సిబ్బందికి సూచించారు.ఆయన వెంట ఎన్‌సీడీ నిర్వహణ అధికారి ఆశిష్‌రెడ్డి, డాక్టర్ రాకేశ్ డిప్యూటీ అధికారి బారె రవీందర్, వైద్యాధికారి మౌనిక పాల్గొన్నారు.