భూసమస్యలపై దరఖాస్తు చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
లోకేశ్వరం: భూసమస్యల పరిష్కారానికి దరఖా స్తులు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం మండలంలోని ఎడ్దూర్, వట్టోలి గ్రామాల్లో నిర్వహించిన భూభారతి సదస్సులకు హాజరయ్యారు. రైతుల దరఖాస్తుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అర్లి నుంచి ఎడ్డూర్ వరకు అధ్వానంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి, బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. అదనపు కలెక్టరు కిశోర్‌కుమార్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, తహసీ ల్దార్ సర్వరాజ్ అహ్మద్, డీటీ రవీందర్ ఉన్నారు.
నర్సాపూర్ (జి): మండలంలోని బూరుగుపల్లి (కె) గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు ని ర్వహించగా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరయ్యారు. అంతకుముందు సమీప ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలను సందర్శించారు. బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో చర్లపల్లిలో 12, బూరుగుపల్లి (కె)లో ఒక దరఖాస్తు వచ్చిన ట్లు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీటీ వాహిదొద్దీన్, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేశ్‌కుమార్ పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
నిర్మల్‌చైన్‌గేట్: రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో సూచించారు. సోష ల్ మీడియాలో వైరలైన గ్రామ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వీడియోపై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకున్నట్లు పేర్కొన్నారు. రెవె న్యూ సదస్సులో రైతుపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్సైని సస్పెండ్ చేసి, విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3నుంచి 20వరకు రెండోవిడత సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 36 రెవెన్యూ గ్రామాల్లో వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.


