
మా భూమి మాకే కేటాయించాలి..
మేము కుంటాల మండలం పెంచికల్పాడు గ్రామస్తులం. 2019లో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్‌లకు దరఖాస్తు చేసుకుంటే సొంత భూమి ఉంటేనే నిర్మాణ పనులు చేపడతామని చెప్పడంతో మా సొంత ఖర్చులతో సర్వే నంబర్ 269/అ 1 లో 2196/2019 రిజిస్ట్రేషన్ ప్రకారం 0.29 గుంటల భూమి కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇచ్చాం. అప్పుడు ప్రభుత్వం అందరికీ భూమి కేటాయించి 20 ఇండ్లు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. కాంట్రాక్టర్ పిల్లర్ల దశ వరకు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సొమ్ము కాంట్రాక్టర్ కు గిట్టుబాటు కాదు అని మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. భూమి కోసం ఒక్కొక్కరం రూ.3 లక్షలు ఇచ్చాం. భూమిని ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేశాం. ఆ భూమి కొన్నది మేమే కాబట్టి మాకే కేటాయించాలి. పట్టాలు ఇవ్వాలి. – డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు, పెంచికల్పడ్