
కొనుగోళ్లలో జాప్యంపై రైతుల రాస్తారోకో
● ఆర్డీవో హామీతో ఆందోళన విరమణ
కుంటాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తుండటంతో బుధవారం మండలంలోని అర్లి(కే) క్రాస్ రోడ్ వద్ద నిర్మల్–భైంసా 61 జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. రెండురోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా ధాన్యం తడుస్తోందని రైతులు వాపోయా రు. విషయం తెలుసుకున్న భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. రైతులు ఆర్డీవోకు సమస్య వివరించారు. రెండురోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని ఆర్డీవో హామీ ఇవ్వగా వారు శాంతించారు. గంటన్నరపాటు రాస్తారోకో చేయగా రో డ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. భైంసాటౌన్ సీఐ గోపీనాథ్, ఏఎస్సైలు దేవన్న, శంకర్, లింబాద్రి పరిస్థితిని చక్కదిద్దారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్ కొ మ్రే వార్, సోషల్ మీడియా ఇన్‌చార్జి పెంటవార్ దశరథ్, మండల కన్వీనర్లు పడకంటి దత్తాత్రి, కోర్వ శ్యామ్, అశోక్ రాథోడ్, రాజుర అనిల్, రజనీకాంత్, రావుల పోశెట్టి, అసడే సజన్, వంశీ హుస్సేన్, ఎ ర్రం తదితరులు పాల్గొన్నారు.