
పకడ్బందీగా ‘భూభారతి’ అమలు
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● కుంటాలలో అధికారులతో సమీక్ష ● ముధోల్‌లో వ్యవసాయ క్షేత్రం పరిశీలన
కుంటాల: భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలి పారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దా ర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన స మీక్షా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు నోటీసు జారీ చేసి ఇరుపక్షాల సమక్షంలో పారదర్శకంగా విచారణ చేపట్టి స మస్యలు పరిష్కరించాలని సూచించారు. సమా వేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, తహసీల్దార్లు కమల్‌సింగ్, ఎజాజ్ అహ్మద్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, డీటీ నరేశ్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
‘మహా’జొన్నలు కొనుగోలు చేయొద్దు
మహారాష్ట్ర నుంచి వచ్చే జొన్నలను కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు అన్యాయం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. త్వరలో కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. కొనుగో ళ్లకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, డీసీవో పల్లె పాపారావు, త హసీల్దార్ కమల్‌సింగ్, పీఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, సీఏవో నాగభూషణం తదితరులున్నారు.
పంట మార్పిడితో లాభాలు
ముధోల్: మట్టి నమూనా పరీక్షలు చేయించుకుని పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని తరోడ గ్రామంలో రైతు హ ర్షియాబేగం సాగుచేస్తున్న సమీకృత వ్యవసాయ క్షే త్రాన్ని పరిశీలించారు. ఉపాధిహామీతోపాటు ఐకేపీ నుంచి తీసుకున్న రుణంతో వివిధ పంటలు, కూరగాయలు, పశువులు, చేపల పెంపకం చేపట్టడాన్ని అభినందించారు. కంపోస్టు ఎరువులను ఎక్కువగా వాడి తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు పొందాలని సూచించారు. చేపల పెంపకంతో ఉపాధి పొందడంతోపాటు భూగర్భ జలాలను పెంచవచ్చని పేర్కొన్నారు. రెండు గుంటల భూమిలో చేప ల పెంపకంతో ఏడాదికి రూ.4లక్షల ఆదాయం సంపాదించవచ్చని తెలిపారు. సమీకృత క్షేత్రంపై రైతులకు అవగాహన కల్పించారు. డీఆర్డీవో విజయలక్ష్మి, ఆర్డీవో కోమల్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో శివకుమార్, ఏపీవో శిరీష, ఏపీఎం గురుచరణ్, ఉపాధిహామీ సిబ్బంది యోగేశ్, భాస్కర్‌రెడ్డి, సుశీల్, పోశెట్టి, సూర్యకాంత్, వందేమాతరం, వీవోఏ ఓమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.