
23న తిరంగా ర్యాలీ
నిర్మల్‌చైన్‌గేట్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా మన దేశ సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తిరంగా ర్యాలీ జిల్లా కన్వీనర్ మేడిసమ్మె రాజు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ర్యాలీ అంబేడ్కర్ చౌక్ నుంచి వివేక్ చౌక్‌కు చేరుకుంటుందని తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాలవారు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
మాట్లాడుతున్న నాయకులు