
శిక్షణ కేంద్రాల తనిఖీ
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న మండల స్థాయి శిక్షణ కేంద్రాలను బుధవారం జిల్లా విద్యాధికారి రా మారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రాథమిక తరగతులకు బోధించే ఉపాధ్యాయులు తమ బోధన తీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. శిక్షణకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. శిక్షణ కేంద్రాలను రాష్ట్ర బాధ్యుడు రామకృష్ణ పరిశీ లించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశా రు. ఎంఈవో వెంకటేశ్వర్, కోర్సు బాధ్యుడు గజ్జరామ్, డీఆర్పీలు పాల్గొన్నారు.