
మొదటి స్థానంలో నిలవాలి
నిర్మల్‌టౌన్: ఇప్పటివరకు ఆదిలాబాద్ రీజియ న్‌లో నిర్మల్ డిపో మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్‌లో రాష్ట్రంలోనూ మొదటి స్థానంలో నిలువాలని ఆదిలాబాద్ ఇన్‌చార్జ్ రీజినల్ మేనేజర్ ప్రణీత్ ఆకాంక్షించారు. బుధవారం నిర్మల్ ఆర్టీసీ డిపోను డిప్యూటీ ఆర్‌ఎం శ్రీహర్షతో కలి సి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదాయ, వ్య యాల గురించి ఆరా తీశారు. కండక్టర్లు, డ్రైవర్ల పనితీరును పరిశీలించారు. పలు ఫైళ్లను తనిఖీ చేశారు. వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులకు అనుగుణంగా బ స్సులను సమయపాలనతో నడపాలని సూ చించారు. డిపో మేనేజర్ పండరి, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు.