
నిర్మల్
జీవన రేఖ.. వివక్షకు ప్రతీక
నిర్మల్ జిల్లాకు బాసర–లక్సెట్టిపేట రహదారి జీవన రేఖగా ఉంది. తూర్పు, పశ్చిమ జిల్లాలను కలుపుతూ 175 కిలో మీటర్ల మేర ఈ రహదారి వ్యాపించి ఉంది.
శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025
10లోu
నిర్మల్‌చైన్‌గేట్: ఇంటర్నెట్, సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లు, టెలివిజన్ వంటి సాంకేతిక సాధనాలు జిల్లా ప్రజల జీవనశైలిని మార్చేస్తున్నాయి. రాత్రి 9 గంటలకే నిద్రించే వారు ఇప్పుడు అర్థరాత్రి దాటినా ఫోన్‌లతో కాలం గడుపుతున్నారు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా జిల్లాలో 1,00,052 మంది కంటిచూపు సమస్యలతో, 30% మంది నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఇటీవలి వైద్య నివేదికలు వెల్లడించాయి. ఈ సమస్యలు మానసిక ఆందోళన, ఏకాగ్రత లోపం, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు, యువత దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఆధునిక జీవనశైలి..
గతంలో రాత్రి 8 గంటలకే నిద్రపోయే గ్రామీణ, పట్టణ ప్రజలు ఇప్పుడు పని ఒత్తిడి, మానసిక ఆందోళనలతో అర్ధరాత్రి దాటినా నిద్రపోవడం లేదు. యువత పార్టీలు, బార్‌లలో రాత్రి వేళల్లో మద్యం, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. జీర్ణం కాకముందే నిద్రించడం వల్ల శ్వాసనాళాలపై ఒత్తిడి పెరిగి, గురక, నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు స్లీపింగ్ టాబ్లెట్స్, మత్తు పదార్థాలపై ఆధారపడుతూ ఒక సమస్య నుంచి మరో సమస్యలో చిక్కుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కంటిచూపుపై సెల్‌ఫోన్ ప్రభావం..
పిల్లలకు భోజనం తినిపించేందుకు తల్లిదండ్రులు రెండేళ్ల వయసు నుంచే సెల్‌ఫోన్ ఇస్తున్నారు. విద్యార్థులు హోంవర్క్, ప్రాజెక్టుల కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడుతూ గంటల తరబడి స్క్రీన్‌లను చూస్తున్నారు. దీనివల్ల కళ్లలో నీరు కారడం, దురద, చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కంటి వైద్యులు తెలిపారు. పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలని, తల్లిదండ్రులు సొంత ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
న్యూస్‌రీల్
అర్ధరాత్రి దాటినా ఫోన్‌లో ఆటలు
ఫేస్‌బుక్, వాట్సాప్ టెక్నాలజీ ప్రభావం
రోజుకు 8 గంటల నిద్ర ఆరోగ్యమంటున్న వైద్యులు
జిల్లాలో ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో
నిర్వహించిన కంటి పరీక్షలు..
పరీక్షలు నిర్వహించిన మొత్తం విద్యార్థులు 46,453
బాలురు 21,807, బాలికలు 24,646
దృష్టి లోపం గుర్తించిన విద్యార్థులు 1,578
బాలురు 853, బాలికలు 725
6 నుంచి 14 ఏళ్లలోపు దూరపు చూపు తక్కువ ఉన్నవారు 1,735
6 నుంచి 14 ఏళ్లలోపు కంటి సమస్యలతో
బాధపడుతున్నవారు 25
15 నుంచి 40 ఏళ్లలోపు దూరపు చూపు తక్కువ ఉన్నవారు 49,512
40 ఏళ్లు పైబడి దగ్గర చూపు తక్కువ ఉన్నవారు 48,811
కంటి మోతి బిందు ఉన్నవారు 7,523
మోతి బిందు ఆపరేషన్ చేయించుకున్న వారు6,242
నిద్ర సమయం ఇలా..
వైద్యుల సిఫార్సు ప్రకారం, రోజుల వయసు శిశువులకు 18 గంటలు, ఏడాది లోపు చిన్నారులకు 14–18 గంటలు, 1–3 ఏళ్ల వారికి 12–15 గంటలు, 3–5 ఏళ్ల వారికి 11–13 గంటలు, 5–12 ఏళ్ల వారికి 9–11 గంటలు, 12–19 ఏళ్ల వారికి 9–10 గంటలు, 21 ఏళ్ల పైబడిన వారికి 7–8 గంటలు, 50 ఏళ్ల పైబడిన వారికి 5–7 గంటల నిద్ర అవసరం. ఈ సమయాన్ని పాటించడం ఆరోగ్యానికి కీలకం.
సాంకేతికత, మారిన జీవనశైలి వల్ల నిద్రలేమి, కంటిసమస్యలు పెరుగుతున్నాయి. యువత, పిల్లలు స్క్రీన్ టైమ్‌ను తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర అలవాట్లను అలవర్చుకోవాలి. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అవగాహన కల్పించి, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించాలి. ఈ సమస్యలను అధిగమించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

నిర్మల్