
కంటి పరీక్షలు చేస్తాం..
చిన్న వయసులో కంటి సమస్యలు గుర్తించాలి. సమస్యలు ఉండే విద్యార్థులు చదువుతోపాటు, ఇతర ఏ అంశంపై ఏకాగ్రత పెట్టలేరు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి, చికిత్స అందిస్తే వారికి మేలు జరుగుతుంది. ప్రధానంగా పాఠశాల వయస్సులో ఆటలు ఆడించడం వల్ల కంటి సమస్యలను కొంత నివారించవచ్చు.
– డాక్టర్ శ్రీనివాస్,
ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం జిల్లా అధికారి
8 గంటల నిద్ర తప్పనిసరి..
ప్రతీ పది మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధ పడుతున్నారు. వ్యక్తికి కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. ఆరు, అంతకన్నా తక్కువ గంటలు నిద్రపోతే ఏకాగ్రత లోపిస్తుంది. జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో కేన్సర్‌తో పోరాడే శక్తి 70 శాతం తక్కువ ఉంటుంది. నిద్రలేమితో మానసిక, శారీరక ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్స్ తగ్గుతాయి. సెక్స్‌వల్ హార్మోన్స్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. – డాక్టర్ సురేశ్,
సీనియర్ కంటి వైద్యనిపుణుడు
సుఖ నిద్ర కోసం జాగ్రత్తలు..
నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు, ఇతరత్రా డిజిటల్ స్క్రీన్‌లు చూడొద్దు. అవి నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాఫీ తాగితే బాగా నిద్ర పడుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. మెదడు చుట్టూ ప్రవహించే కెఫిన్ గాఢనిద్రను దూరం చేస్తుంది. మద్యం సహజసిద్ధమైన నిద్రను దూరం చేస్తుంది. గాఢ నిద్రను అడ్డుకుంటుంది. రాత్రి 7 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి. వ్యాయామం, యోగాసనాలు సుఖనిద్రకు దోహదపడతాయి.
– డాక్టర్ రత్నాకర్, ఫిజీషియన్

కంటి పరీక్షలు చేస్తాం..

కంటి పరీక్షలు చేస్తాం..