● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకో వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అంబులెన్సు సే వలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందు కు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజేందర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సురేశ్, ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు గోపాల్ సింగ్, వైద్యాధికారులు సౌమ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ మృతుని కుటుంబానికి అండగా ఉంటాం..
సోన్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్‌సాగర్ దుబాయ్‌లో ఇటీవల హత్యకు గురయ్యాడు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ భరోసా ఇచ్చారు. గురువారం ప్రేమ్‌సాగర్ కుటుంబ సభ్యులు కలెక్టర్‌ను కలిసి తమ బాధను వ్యక్తం చేశారు. కలెక్టర్ బాధితులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ప్రేమ్‌సాగర్ భార్య ప్రమీల, పిల్లలు, తల్లి లక్ష్మి ఉన్నారు.