హైబ్రిడ్‌ వరి.. రైతుకు సిరి | - | Sakshi
Sakshi News home page

హైబ్రిడ్‌ వరి.. రైతుకు సిరి

May 8 2025 12:19 AM | Updated on May 8 2025 12:19 AM

హైబ్ర

హైబ్రిడ్‌ వరి.. రైతుకు సిరి

నిర్మల్‌
తలసేమియా చంపేస్తోంది!
ఉమ్మడి జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం పరిమిత సా యం అందిస్తుండగా బాధితులు దాతల సా యం కోసం ఎదురుచూస్తున్నారు.

గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025

10లోu

చట్టాలపై అవగాహన ఉండాలి

లక్ష్మణచాంద: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక సూచించా రు. బుధవారం మండలంలోని వడ్యాల్‌ రైతువేదికలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రైతులతో సమావేశమై రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. సమావే శంలో తహసీల్దార్‌ జానకి, ఎంపీడీవో రాధ, ఎస్సై సుప్రియ, న్యాయవాదులు లింగాగౌడ్‌, రమణగౌడ్‌, వీడీసీ సభ్యులు రాంరెడ్డి, నరేశ్‌రెడ్డి, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

పొట్టపెల్లి (కే) నర్సరీ సందర్శన

మండలంలోని పొట్టపెల్లి (కే) గ్రామ నర్సరీని సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న డ్రాగన్‌ ఫ్రూట్‌, వివిధ రకాల ఔషధ, పూల మొక్కలను చూసి సంతోషం వ్యక్తంజేశారు. నర్సరీ నిర్వాహకులను అభినందించారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఎంపీడీవో రాధ, పంచాయతీ కార్యదర్శి ప్రియాంకరెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

లక్ష్మణచాంద: సోన్‌ మండలం బొప్పారం గ్రామ యువ రైతులు సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. తక్కువ సమయంలో అధిక దిగుబడులు సాధించి స్ఫూర్తిదా యక విజయాన్ని నమోదు చేశారు. సంప్రదాయ వరి సాగుకు భిన్నంగా, హైబ్రిడ్‌ వరి సాగుతో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. బొప్పారం గ్రామానికి చెందిన 17 మంది రైతులు యాసంగిలో సంప్రదాయ వరి సాగుకు బదులు ఆడ–మగ 826 హైబ్రిడ్‌ వరి రకాన్ని 40 ఎకరాల్లో సాగు చేశారు. బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్‌ కంపెనీ బై బ్యాక్‌ పద్ధతిలో ఈ విత్తనాలు రైతులకు సరఫరా చేస్తోంది.

సాగుకు సహకారం

రైతులకు ఎకరాకు రూ.20వేల పెట్టుబడి ఖర్చులు సదరు కంపెనీ ముందస్తుగా అందజేసింది. పంట సాగు నుంచి కోత దశ వరకు కంపెనీ ప్రతినిధులు రైతులకు సలహాలు, సూచనలు అందించారు. ఒకవేళ పంట దిగుబడి తగ్గినా ఎకరానికి రూ.70,000 చెల్లిస్తామని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. కంపెనీ ఆడ విత్తనాలను కొనుగోలు చేస్తుండగా, మగ విత్తనాలను రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించారు.

అధిక లాభాలతో విజయం

ఈ హైబ్రిడ్‌ వరి సాగు చేసిన రైతులకు ఎకరానికి 10–11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.10వేల చొప్పున ఎకరానికి రూ.1.10లక్షల ఆ దాయం వచ్చింది. రూ.25వేలు సాగు ఖర్చులు పో ను రైతులకు రూ.85వేల లాభం లభించింది. సంప్రదాయ వరి సాగుతో ఎకరాకు రూ.20వేలు కూడా లాభం వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా అన్నదాతలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. కంపెనీ ప్రతినిధులు ఈ పద్ధతిని మిగతా రైతులు కూడా అనుసరించాలని కోరుతున్నారు.

న్యూస్‌రీల్‌

ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి

రూ.10వేలు పలుకుతున్న ధర

బొప్పారంలో 40 ఎకరాల్లో సాగు

ఆదాయం ఆర్జిస్తున్న అన్నదాతలు

హైబ్రిడ్‌ వరి.. రైతుకు సిరి1
1/2

హైబ్రిడ్‌ వరి.. రైతుకు సిరి

హైబ్రిడ్‌ వరి.. రైతుకు సిరి2
2/2

హైబ్రిడ్‌ వరి.. రైతుకు సిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement