నిర్మల్: రాజ్యసభలోకి అడుగుపెట్టి తొలి గుర్తింపు దక్కించుకున్న నిర్మల్‌బిడ్డ సిర్గాపూర్ నిరంజన్‌రెడ్డి. అదే పెద్దలసభకు ‘పెద్ద’గా వ్యవహరించి జిల్లాపేరు దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేశారు. దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్‌కు చెందిన నిరంజన్‌రెడ్డి దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరొందారు. వైస్సార్ కాంగ్రెస్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్యసభలో ప్యానెల్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నిరంజన్‌రెడ్డి మంగళవారం జరిగిన సమావేశాల్లో తన బాధ్యతలను నిర్వర్తించారు. పెద్దల సభగా గుర్తింపు పొందిన రాజ్యసభకు ‘పెద్ద’గా తాను వ్యవహరించిన తీరును అందరూ ప్రశంసించారు. జిల్లావాసికి అరుదైన గుర్తింపు దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
నిరంజన్‌రెడ్డి