‘ఎల్‌ఆర్‌ఎస్‌’లో 25 శాతం రాయితీ● | - | Sakshi
Sakshi News home page

‘ఎల్‌ఆర్‌ఎస్‌’లో 25 శాతం రాయితీ●

Mar 12 2025 7:33 AM | Updated on Mar 12 2025 7:29 AM

నిర్మల్‌చైన్‌గేట్‌:రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించిందని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌) దరఖాస్తుల పరిష్కారంపై పంచాయతీ, మున్సిపల్‌ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 31వ తేదీలోపు పూర్తి ఫీజు చెల్లించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 46 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు, లోకల్‌ టీవీ ఛానెళ్లలో ప్రచారం చేయాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టాం టాం వేయించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్‌, రాజేశ్‌కుమార్‌, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

మాస్‌ కాపీయింగ్‌ దూరంగా ఉండాలి

సోన్‌: పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు దూరంగా ఉండాలని, సొంతంగా పరీక్షలు రాయాలని డీఈవో రామారావు సూచించారు. మండలంలోని మాదాపూర్‌ ఉ న్నత పాఠశాలను మంగళవారం సందర్శించా రు. తొమ్మిది, పది తరగతి విద్యార్థుల గ్రేడ్లపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 9వ తరగతి విద్యార్థుల ఎల్‌ఈపీ ప్రగతి, నివేదికలను సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులను ఒక్కొక్కరిని పిలిచి వారి ప్రగతి అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎన్ని రోజులు, ఎన్ని గంటలు పాఠశాలకు వ చ్చారని, అందులో ఎన్ని గంటలు పరీక్షలు రా స్తున్నారు విద్యార్థులను అడిగి తెలుసుకున్నా రు. సబ్జెక్టుల వారీగా సిలబస్‌ గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని సూ చించారు. 9, 10 తరగతి విద్యార్థులు సాధించిన మార్కులు గ్రేడ్లను డిస్‌ప్లే చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు.

ఇంటర్‌ పరీక్షలకు 471 మంది గైర్హాజర్‌

నిర్మల్‌ రూరల్‌: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు 471 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 7,343 మంది విద్యార్థులకు 6,872 మంది హాజరయ్యారు. జనరల్‌ కేటగిరీలో 6,501 మందికి 6,139 మంది హాజరవగా, 362 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కేటగిరీలో 842 మంది విద్యార్థులకు 733 మంది హాజరవగా, 109 మంది గైర్హాజర్‌ అయ్యారని డీఐఈవో పరశురాం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement