అన్నింటికీ ఆమే ఆధారం. అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, బిడ్డగా అన్ని బాధ్యతల్లోనూ మెప్పిస్తోంది. ఇంటిల్లిపాదిని చూసుకుంటూనే ఇంటి బాధ్యతల్లోనూ భర్తకు బాసటగా నిలుస్తోంది. తనకాళ్లపై తాను నిలవడమే కాకుండా తనతోపాటు పదిమందికి ఆసరా అవుతోంది. నారీశక్తి తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదని చాటుతోంది. తన పరిధిలోనే స్వయంశక్తితో, సమష్టితత్వంతో, సంఘటితంగా ఆర్థిక స్వావలంబనను సాధిస్తోంది. అన్నీ ఉండి సోమరితనంతో నిద్రపోతున్న ఎంతోమందికి ఆదర్శమూర్తిగా నిలుస్తోంది. జిల్లాలో ఒక్కో మండలంలో ఒక్కో వినూత్న ఉపాఽధితో సత్తా చాటుతున్నారు స్వయంసహాయక సంఘాల మహిళలు. తాము ఉపాధిని పొందడంతో పాటు పదిమందికి ఆదర్శంగానూ నిలుస్తున్నారు. కలెక్టర్ అభిలాషఅభినవ్, డీఆర్డీవో విజయలక్ష్మి, సంబంధిత అధికారుల ప్రోత్సాహంతో ముందడుగేస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరిపై ప్రత్యేక కథనం.
– నిర్మల్