నిర్మల్‌చైన్‌గేట్: బేటీ బచావో.. బీటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అ హ్మద్ బుధవారం పలువురు డిగ్రీ కళాశాల వి ద్యార్థినులతో సమావేశమై చట్టాలపై అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బేటీ బచావో.. బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలను జనవరి 22నుంచి మార్చి 8వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ హెల్ప్‌లైన్ నంబర్లు 100, 1098,181, 1930, బాల్య వివాహ నిర్మూలన చట్టం–2006, బాలికలు, మహిళల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏసీడీపీవో నాగలక్ష్మి, మిషన్ శక్తి సమన్వయకర్త సవిత, మిషన్ శక్తి బృందం సభ్యులు, విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అవగాహన కల్పిస్తున్న ఫైజాన్ అహ్మద్