ఉత్తమ ఫలితాలు సాధిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఫలితాలు సాధిస్తాం

Mar 3 2025 12:06 AM | Updated on Mar 3 2025 12:04 AM

● ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం పెంచుతాం ● పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ● ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఐఈవో

నిర్మల్‌ రూరల్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని డీఐఈవో పరశురాం పేర్కొన్నారు. ఈ నెల 5నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

సాక్షి: ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

డీఐఈవో: ఉత్తీర్ణత శాతం పెరుగుదలకు 90రోజుల ప్రణాళికను ఫిబ్రవరి 20 వరకు అమలు చేశాం. అధ్యాపకులు ప్రతీరోజు ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు బోధించారు. వెనుకబడిన, గైర్హాజరైన విద్యార్థులపై దృష్టి సారించారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రతీరోజు హాజరయ్యేలా చూశారు. దసరా సెలవుల తర్వాత సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు ప్రత్యేక అధ్యయన తరగతులు, పునఃశ్చరణ, స్లిప్‌ టెస్ట్‌లు కూడా నిర్వహించారు. ఈ ప్రణాళిక సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నాం.

సాక్షి: జిల్లాలో ఎన్ని పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య ఎంత?

డీఐఈవో: జిల్లాలో మొత్తం 23 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశాం. 13,133 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,571 మంది ఫస్టియర్‌ విద్యార్థులు కాగా, 6,562 మంది సెకండియర్‌ విద్యార్థులున్నారు. ఫస్టియర్‌ ఒకేషనల్‌లో 1,088, సెకండియర్‌లో 945 మంది విద్యార్థులున్నారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలుంటాయి.

సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని నియమించారు?

డీఐఈవో: పరీక్షల నిర్వహణకు 23 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 23 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ప్రతీ 40 మంది వి ద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌తోపాటు ఫ్ల యింగ్‌ స్క్వాడ్‌ టీంను నియమించాం. ఈ టీంలో ఒక డిప్యూటీ తహసీల్దార్‌, ఎస్సై, ఏఎస్సై, సీనియర్‌ లెక్చరర్లు సభ్యులుగా ఉంటారు.

సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టారు?

డీఐఈవో: పరీక్షలు సజావుగా నిర్వహించేందు కు ఇటీవల కలెక్టర్‌ ఆధ్వర్యంలో వివిధ శా ఖల అధికారులతో సమీక్ష నిర్వహించాం. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అ ధ్యాపకులతో పరీక్షలకు విద్యార్థులను స న్నద్ధం చేయడంపై సమీక్ష నిర్వహించాం. పరీక్షల కమిటీని నియమించాం. ప్రతీ పరీక్షాకేంద్రంలో మూడు నుంచి నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. విద్య, పోలీస్‌, ఆరోగ్యశాఖల అధికారుల సహకారం తీసుకుంటున్నాం.

సాక్షి: విద్యార్థుల ప్రగతిని ఎలా అంచనా వేస్తున్నారు?

డీఐఈవో: ఈ విద్యా సంవత్సరంలో నాలుగు యూనిట్‌, అర్ధ వార్షిక, రెండు ప్రీఫైనల్‌ ప రీక్షలు నిర్వహించాం. ఇటీవల ప్రాక్టికల్‌ ప రీక్షలు కూడా పూర్తయ్యాయి. పరీక్షలకు విద్యార్థులంతా హాజరయ్యేలా చూశాం. స మాధాన పత్రాలను ఎప్పటికప్పుడు మూ ల్యాంకనం చేశాం. పరీక్షా ఫలితాలను సమీక్షించి విద్యార్థులకు తగిన సూచనలు చేశాం. ఈ విధానంతో జిల్లాలో ఈసారి ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మరింత మెరుగవుతుందని ఆశిస్తున్నాం.

ఉత్తమ ఫలితాలు సాధిస్తాం 1
1/1

ఉత్తమ ఫలితాలు సాధిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement