మహిళా సాధికారతకు బ్యాంకుల చేయూత | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు బ్యాంకుల చేయూత

Mar 1 2025 7:53 AM | Updated on Mar 1 2025 7:52 AM

● అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: మహిళా సాధికారతకు బ్యాంకులు చేయూత అందిస్తున్నాయని అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌ తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ మినీ స్టేడియం వరకు 2కే రన్‌ నిర్వహించారు. ఫైజాన్‌ అహ్మద్‌ జెండా ఊపి ప్రారంభించారు. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేలా, అవగాహన కల్పించేలా నినాదాలు చేస్తూ ఈ 2కే రన్‌ ర్యాలీ సాగింది. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం బ్యాంకుల ద్వారా మహిళలు అన్నిరంగాల్లో పరిపుష్టి సాధించడమే అన్నారు. ఆయా పథకాలకు, రుణాలకు అర్హులైన మహిళలందరూ వాటిని సద్వినియోగం చేసుకుని ఎదగాలన్నారు. మహిళలకు సంబంధించి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న అన్ని రకాల పథకాలపై అధికారులు మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. స్వయం సంఘాలకు చేయూతనివ్వడానికి ఎన్నోరకాల పథకాలు ఉన్నాయని, మహిళా సాధికారిత సాధించడానికి ఈ పథకాలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు బ్యాంకు ఖాతాలు కలిగి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రామ్‌గోపాల్‌, జెడ్పీ సీఈవో గోవింద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, మెప్మా పీడీ సుభాష్‌, వెనుకబడిన తరగతుల అధికారి రాజేశ్వర్‌గౌడ్‌, సీడీపీవో నాగలక్ష్మి, ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ అశోక్‌కుమార్‌, మహిళలు, బ్యాంకర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement