జీవశాస్త్రంలో పాఠాలను అర్థం చేసుకుని చదవాలని నిర్మల్ జిల్లా పార్‌పెల్లి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గంగ సురేష్ తెలిపారు.
● పోషణ అనే పాఠ్యాంశంలో ఆకుల్లో పిండి పదార్థాలు కలవని నిరూపించే ప్రయోగం, కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాకై ్సడ్ అవశ్యకత, హైడ్రిల్లా, నల్ల కాగితం ప్రయోగం, విటమిన్లు తెలిపే పట్టిక, జీర్ణ వ్యవస్థను సూచించే ఫ్లో చార్ట్, హరిత రేణువు, అమీబా–పోషణ పటం భాగాలు, స్వయం పోషణ– పరపోషణ, కాంతి చర్య–నిష్కాంతి చర్య మధ్య గల భేదాలు చదవాలి.
● శ్వాసక్రియలో ఈస్ట్‌తో అవాయు శ్వాసక్రియ ప్రయోగం, కార్బన్‌డయాకై ్సడ్ ఉష్ణోగ్రత విడుదలయ్యే ప్రయోగం, వాయుగోని పటం–భాగాలు, మైటో కాండ్రియా పటం వంటివి చదవాలి.
● ప్రసరణలో పేరు పీడనం ప్రయోగం వ్యాసరూప ప్రశ్న వేసే అవకాశం ఉంది. హృదయం అంతర్నిర్మాణం–పటం భాగాలు ఏకవలయ– ద్వివలయ రక్తప్రసరణ వ్యవస్థ బేధాలు తెలపడంలో ధమనులు–సిరలు, సిస్టోల్–డయస్టోల్, దారువు–పోషక కణజాలం మధ్య గల భేదాలు గుర్తించి అవగాహన చేసుకోవాలి.
● విసర్జన అనే పాఠ్యాంశంలో నెఫ్రాన్ నిర్మాణం వ్యాసరూప ప్రశ్నగా అడిగే అవకాశం ఉంది. ఇతర జీవుల్లో విసర్జన అవయవాలు– అల్కలైడ్ మొక్క పేరు– ఉపయోగాలు పట్టిక, మానవ మూత్రపిండం అడ్డుకోత పటం–భాగాలు బేధాల, విసర్జన– స్రావం మధ్య గల భేదాలు చూసుకోవాలి.
● వనపర్తి వడ్డిచెర్లలోని నీటి వనరుల పరిస్థితి గురించి సమాచార పట్టికలు, కొత్తపల్లిలో నీటి యాజమాన్యంపై ప్రశ్నలు ఉంటాయి. అలాగే అడవుల సంరక్షణపై సమాధానాలు రాయాలి.
● హార్మోన్ల పేర్లు, వాటి ప్రభావం, ఫైటో హార్మోన్లు–ఉపయోగాలు, సమాచార పట్టిక, మానవ మెదడు పటం–భాగాలు తదతర వాటిపై అవగాహన చేసుకోవాలి.
● ప్రత్యుత్పత్తి పాఠ్యాంశంలో మానవ శుక్రకణం పటం–భాగాలు, సీ్త్ర, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు పటం–భాగాలు, పుష్పము పటం– భాగాలు, అండం నిర్మాణం పటం, భాగాలు, భేదాలను చదవాలి.
● ఆమ్లం పత్ర ప్రయోగం సమాచార పట్టికలు, బోలాస్–కై మ్, మాస్టిఫికేషన్–రూమినేషన్ మధ్య గల భేదాలు, అంత్ర చూశకం పటం–భాగాలు చూసుకోవాలి.
● అనువంశికత–పరిణామంలో డార్విన్ సిద్ధాంతం, లామార్కు వాదం, లింగ నిర్ధారణ, ఏక సంకరీకరణ, ద్విసంకరీకరణ వివరణ భేదాలను తెలుసుకోవాలి.
● ఆహారపు గొలుసులు, ఆహారపు, జాలకం జైవిక వృద్ధి కరణ, శక్తి పిరమిడ్ సంఖ్య, పిరమిడ్, విషపూరిత పదార్థాల వాడకం వల్ల జరిగే ప్రభావం ఏంటో చదవాలి.