సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయం ప్రాంగణంలో నిర్వహించే వివిధ దుకాణ సముదాయాలకు ఆల య కమిటీ అధ్యక్షుడు ఆయిటి చందు ధ్వర్యంలో సోమవారం బహిరంగ వేలం నిర్వహించా రు. భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలు, కనుములు సేకరించుకునే హక్కును జామ్ గ్రా మానికి చెందిన వెంకటరమణ రూ.4.74 లక్షల కు దక్కించుకున్నారు. ఇతరములు–2 అనే హ క్కును నిర్మల్‌కు చెందిన షేక్ హుస్సేన్ రూ.69 వేలకు దక్కించుకున్నారు. ఇక అమ్మవారికి భ క్తులు సమర్పించే ఒడి బియ్యం సేకరణకు ఎవ రూ ముందుకు రాకపోవడంతో వేలం నిలిపివేశామని ఈవో రంగు రవికిషన్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ ఆది లాబాద్ రాజమౌళి, ధర్మకర్తల మండలి సభ్యులు, సీనియర్ అసిస్టెంట్ రమణారావు, రికార్డ్ అసిస్టెంట్లు బుచ్చన్న, సోని ఉన్నారు.