ZIka Virus: మళ్లీ జికా కలకలం.. ఇది వారిలో అత్యంత ప్రమాదం

Zika virus: Indias Kerala State On Alert After 14 Cases Reported - Sakshi

కేరళలో 14 కేసులు నమోదు 

గాలి, నీరు తాకడంతో వ్యాపించదు

దోమలు, రక్త మార్పిడి ద్వారా మాత్రమే సంక్రమణ 

గర్భిణులకు మాత్రం ప్రమాదకరమని నిపుణుల హెచ్చరిక 

కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్‌ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. మొదట ఒక 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్‌ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టుగా తేలింది. జికా ఇన్ఫెక్షన్‌ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్‌ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిస రని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ జికా ఏంటి? లక్షణాలు, ప్రమాదాలేమిటి తెలుసుకుందామా? 

మెదడు, నాడీ మండలంపై ఎఫెక్ట్‌ 
జికా వైరస్‌ లక్షణాలు మరీ ఇబ్బందిపెట్టే స్థాయిలో ఉండవు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాల నొప్పులు ఉంటాయి. కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. బయటికి వైరస్‌ లక్షణాలు కనబడకున్నా ‘గిల్లేన్‌ బారే సిండ్రోమ్‌ (నాడులు దెబ్బతిని చేతులు, కాళ్లపై నియంత్రణ దెబ్బతినడం, వణికిపోవడం)’ తలెత్తే ప్రమాదం ఉంటుంది. 

ఉగాండాలో మొదలై.. 
1947లో ఉగాండాలోని జికా అడవిలో ఉండే కోతుల్లో కొత్త వైరస్‌ను కనుగొన్నారు. దోమల ద్వా రా వ్యాపిస్తుందని గుర్తించారు. ఆ అడవి పేరుతోనే జికా వైరస్‌గా పేరుపెట్టారు. 1952లో తొలిసారిగా ఉగాండా, టాంజానియాల్లో మనుషులకు జికా వైరస్‌ సోకింది. మెల్లగా ఇతర దేశాలకు విస్తరించింది. 2007లో, 2013లోనూ పలు దేశాల్లో కొన్ని కేసులు బయటపడ్డాయి. తర్వాత వైరస్‌ మ్యుటేట్‌ అయి కొత్త వేరియంట్లు వచ్చాయి. 2015–16లో జికా మహమ్మారి గా మారింది. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల్లో ప్రతాపం చూపింది.
 –సాక్షి సెంట్రల్‌డెస్క్‌

ఎలా వ్యాపిస్తుంది? 
డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్‌ వంటి వ్యాధులను వ్యాప్తి చెందించే ఎడిస్‌ రకానికి చెందిన దోమల ద్వారానే జికా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఇవి పగలు మాత్రమే కుడతాయి.  
లైంగిక ప్రక్రియ ద్వారా, రక్తం ద్వారా కూడా వ్యాపిస్తుంది. గాలి, నీళ్లు, బాధితులను తాకడం వంటి వాటి ద్వారా ఇది సోకే అవకాశం లేదు. రక్త పరీక్ష ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తిస్తారు. 
ఈ వైరస్‌ సోకినా కూడా.. ప్రతి పది మందికిగాను ఇద్దరిలో మాత్రమే లక్షణాలు ఉంటాయి. 
వ్యక్తులను బట్టి శరీరంలో 3 రోజుల నుంచి 14 రోజుల మధ్య ఈ వైరస్‌ సంఖ్యను పెంచుకుని, లక్షణాలు బయటపడతాయి. వారం రోజుల్లోగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. 
జికాకు సంబంధించి ప్రత్యేకంగా చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ ప్రస్తుతం అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి సాధారణ మందులనే ఇస్తారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌పై పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

గర్భస్థ శిశువులకు ప్రమాదం 
గర్భిణులకు సంబంధించి మిగతా చాలా రకాల వైరస్‌లతో పోలిస్తే జికా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనది. ఇది గర్భం లోని శిశువులకు కూడా వ్యాపించి మైక్రోసెఫలీ (మెదడు సరిగా ఎదగదు. తల పైభాగం కుచించుకుపోతుంది), ఇతర సమస్యలకు కారణం అవుతుంది. గర్భిణులు, పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు, రెండేళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. 

‘జికా’పై కేంద్రం అప్రమత్తం 
కేరళకు ఆరుగురు నిపుణుల బృందం
న్యూఢిల్లీ: కేరళలో జికా వైరస్‌ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించింది. ఈ బృందం కేరళలో పరిస్థితులను సమీక్షించడంతోపాటు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందజేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. కేంద్ర బృందంలో సీనియర్‌ వైద్యులతోపాటు అంటువ్యాధుల నిపుణులు ఉన్నారని.. కేరళలో పరిస్థితిని కేంద్రం పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం జికా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. కేసులను గుర్తించిన తిరువనంతపురం జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేపట్టింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-07-2021
Jul 10, 2021, 14:27 IST
చెన్నై: కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూలై 19...
10-07-2021
Jul 10, 2021, 13:55 IST
అయితే మొదటి టీకా డోసు తీసుకున్నప్పుడున్న ఉత్సాహం రెండో డోసు తీసుకోవడంలో కనిపించడం లేదు.  
10-07-2021
Jul 10, 2021, 08:32 IST
కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభణ తగ్గి లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే.. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఒకవైపు ఉద్యోగాలు, చిరువ్యాపారులు నిత్యజీవితంలోకి అడుగుపెట్టారు....
10-07-2021
Jul 10, 2021, 00:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సంక్రమణ నేపథ్యంలో ఒకవేళ థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు...
09-07-2021
Jul 09, 2021, 09:55 IST
సాక్షి, బెంగళూరు: కరోనాతో మృతి చెందిన రైతుల వివరాలను సేకరిస్తున్నట్లు, వారి పంట రుణాలను మాఫీ చేస్తామని సహకారశాఖ మంత్రి...
08-07-2021
Jul 08, 2021, 15:47 IST
ముంబై: మహారాష్ట్రలో నకిలీ టీకా ఇచ్చిన బాధితుల సర్టిఫికెట్లను రద్దు చేయాలని కోరుతూ మహారాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ...
08-07-2021
Jul 08, 2021, 09:55 IST
సాక్షి, బెంగళూరు: మహమ్మారి కరోనా తగ్గినట్లే తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,743 పాజిటివ్‌ కేసులు...
07-07-2021
Jul 07, 2021, 16:16 IST
వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కోవిడ్‌.. ఆ వెంటనే బ్లాక్‌ ఫంగస్‌.. మల్టిపుల్‌ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌
07-07-2021
Jul 07, 2021, 07:30 IST
టోక్యో: విశ్వ క్రీడలంటేనే ప్రతిష్టాత్మకం. అలాంటే మేటి ఒలింపిక్స్‌ క్రీడలను ఔత్సాహిక ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసేందుకు ఎగబడతారు. నెలల ముందే...
07-07-2021
Jul 07, 2021, 07:28 IST
కర్ణాటకలో 725 డెల్టా, 2 రెండు డెల్టాప్లస్‌ కేసులు
07-07-2021
Jul 07, 2021, 07:02 IST
లండన్‌: శ్రీలంకను పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఊదేసిన ఇంగ్లండ్‌ జట్టును కరోనా వైరస్‌ చుట్టుముట్టింది. ముగ్గురు ఆటగాళ్లతో పాటు నలుగురు...
07-07-2021
Jul 07, 2021, 04:41 IST
‘దేవుడి దయవల్ల కరోనా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్‌ నియంత్రణలో కలెక్టర్లు అద్భుతంగా పనిచేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. అందులో భాగస్వాములైన...
07-07-2021
Jul 07, 2021, 04:04 IST
సాక్షి, అమరావతి: కరోనా మరణాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో ముందంజలో కొనసాగుతోంది. దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌.. మరణాల...
07-07-2021
Jul 07, 2021, 02:39 IST
న్యూఢిల్లీ: కరోనా ఎలా వచ్చిందో, దేని ద్వారా వచ్చిందోననే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది ఈ వైరస్‌ చైనాలోని...
07-07-2021
Jul 07, 2021, 01:25 IST
బోస్టన్‌: కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వైరస్‌ వేరియంట్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాల కోసం శాస్త్రవేత్తలు కొత్త చిట్కాను కనిపెట్టారు....
06-07-2021
Jul 06, 2021, 18:56 IST
లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ప్రభుత్వం వ్యక్తిగత బాధ్యతను గుర్తు చేస్తూ.....
06-07-2021
Jul 06, 2021, 03:43 IST
సెప్టెంబర్‌ నెల మధ్య నాటికే కరోనా మూడో వేవ్‌ పతాక స్థాయికి చేరొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్త...
06-07-2021
Jul 06, 2021, 00:40 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులుగా పరిస్థితులు కాస్త...
05-07-2021
Jul 05, 2021, 20:49 IST
సాక్షి, అమరావతి: కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజుల సెలవు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది....
04-07-2021
Jul 04, 2021, 08:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 34.46 కోట్లు దాటింది. శనివారం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top