ఏపీ భవన్‌లో ఘనంగా వైఎస్‌ జయంత్యుత్సవాలు 

YS Rajasekhara Reddy Jayanthi Celebrations At AP Bhavan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 73వ జయంతి, రైతు దినోత్సవ ఉత్సవాలను శుక‍్రవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత రైతు సమాఖ్య కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్‌ అని ఆయన కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. 

ఇది కూడా చదవండి: 2024 తర్వాత బాబు ఏమైపోతాడోనని భయమేస్తోంది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top