‘నాగపూర్‌ ప్లాన్‌’ అంగీకరించం | Will not accept NEP destructive Nagpur plan: TN CM Stalin | Sakshi
Sakshi News home page

‘నాగపూర్‌ ప్లాన్‌’ అంగీకరించం

Mar 12 2025 5:11 AM | Updated on Mar 12 2025 5:11 AM

Will not accept NEP destructive Nagpur plan: TN CM Stalin

తేల్చిచెప్పిన సీఎం స్టాలిన్‌  

చెన్నై: జాతీయ విద్యా విధా నం అనేది విధ్వంసకర నాగ పూర్‌ ప్లాన్‌ అని తమి ళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ పరోక్షంగా ఆర్‌ ఎస్‌ఎస్‌పై మండిపడ్డారు. దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పా రు. హిందీ, సంస్కృత భాషలను ఆమోదిస్తే రూ.2 వేల కోట్లు ఇస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అంటున్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు ఇచ్చినా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్టాలిన్‌ స్పష్టంచేశారు.

మంగళవారం చెంగల్‌పేటలో ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యా విధానం తమిళనాడులో విద్యాభివృద్ధిని పూర్తిగా దెబ్బతీస్తుందని తెలిపారు. విద్యార్థులను విద్య నుంచి దూరం చేసేలా ఈ విధానం తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా రంగంపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటని నిలదీశారు.

విద్యలో మతతత్వాన్ని పెంచడం, ప్రైవేటీకరణను ప్రోత్సహించడం సరైంది కాదని స్పష్టం చేశారు. కేవలం సంపన్న వర్గాల పిల్లలే ఉన్నత విద్య అభ్యసించాలా? పేదలకు చదువుకొనే అవకా శాలు లభించకూడదా? అని ప్రశ్నించారు. తమిళ నా డు ప్రయో జనాల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాడుతూనే ఉంటామని స్టాలిన్‌ పునరుద్ఘాటించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement