ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్

Will Messenger Of God  Answer P Chidambaram Swipe At Centre - Sakshi

ఢిల్లీ : జీఎస్‌టీ ప‌రిహారానికి సంబంధించి రాష్ర్టాల‌కు ఇవ్వాల్సిన వాటాల‌పై గురువారం ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ నాయ‌కుడు పి.చిదంబ‌రం ఖండించారు. క‌రోనా కార‌ణంగానే జీఎస్‌టీ వృద్ధిరేటు ప‌డిపోయింద‌న్న నిర్మ‌లా వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. మ‌హ‌మ్మారి దేశ  ఆర్థిక వ్యవస్థను గట్టిగానే తాకిందని దీంతో ప్ర‌స్తుత ఆర్థిక సంవత్సరంలో(2020–21) వృద్ధి పడిపోనుందని ఈ ప్ర‌కృతి చ‌ర్య‌ను దేవుని చ‌ర్య‌గా ఆమె అభివ‌ర్ణించారు. దీంతో ఆర్థిక‌మంత్రిని దేవుని దూత‌గా వ్యంగంగా పేర్కొన్న చిదంబ‌రం.. క‌రోనా సంక్షోభానికి ముందు ప‌త‌న‌మైన ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌పై కూడా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. 2018-19 నాటికి 7.1గా ఉన్న ఆర‌థి వృద్ధిరేటు 2019-20 త్రైమాసికం నాటికి  3.1 శాతానికి ఎలా ప‌డిపోయిందో కూడా ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చిదంబ‌ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. (ఎన్‌పీసీఐకి షాక్ : ఎస్‌బీఐ కొత్త సంస్థ)

జీఎస్‌టి ప‌రిహారాన్ని కేంద్రం రెండు ఆప్ష‌న్లుగా రాష్ర్టాల‌కే  వ‌దిలేసింది. అయితే వీటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని కేంద్ర మాజీ మంత్రి జైరాం ర‌మేష్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పరిహార సెస్ కింద భవిష్యత్తులో రాబడులను తాకట్టు పెట్టడం ద్వారా రుణాలు తీసుకోవాలని మొద‌టి ఐచ్చికంలో ఉంది. అయితే దీని వ‌ల్ల  ఆర్థిక భారం పూర్తిగా రాష్ట్రాలపై పడుతుంది. ఇక రెండో ఐచ్ఛిక కింద రాష్ట్రాలు ఆర్‌బిఐ విండో నుంచి రుణం తీసుకోమని ఉంది. ఇది మార్కెట్ రుణాల కంటే ఎక్కువ‌. దీని వ‌ల్ల రాష్ర్టాల‌కు ఒరిగే లాభ‌మేంటి? క‌రోనా మ‌హ‌మ్మారి లాంటి ఒక విప‌త్తు త‌లెత్తిన‌ప్పుడు కేంద్రం చేయాత‌నివ్వాలి. కానీ కేంద్రం చెబుతున్న రెండు ఐచ్ఛికాలు ఎంత‌మాత్రం ఆమోద‌యోగ్యంగా లేవు. రాష్ర్టాల‌కు ఇచ్చే ఆర్థిక ప‌రిహారం నుంచి కేంద్ర ప్ర‌భుత్వం  త‌ప్పించుకుంటుంది అని పేర్కొన్నారు.  కరోనావైరస్ మహమ్మారి కార‌ణంగా నెల‌కొన్న ఆర్థిక కొర‌త నేప‌థ్యంలో ప‌రిహారం కోరుతూ రాష్ర్టాలు డిమాండ్ చేశాయి. ఈ నేప‌థ్యంలో గురువారం జ‌రిగిన 41వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. (2020–21లో ఆర్థిక వ్యవస్థ క్షీణత)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top