రూ.2,500 రూపాయలు ఎప్పుడు వస్తాయి.. | Woman Questions TVK MLA Over ₹2,500 Poll Promise At Government Hospital, More Details Inside | Sakshi
Sakshi News home page

రూ.2,500 రూపాయలు ఎప్పుడు వస్తాయి..

May 21 2026 10:51 AM | Updated on May 21 2026 12:26 PM

When Will The 2500 Arrive Woman Questions TVK MLA

చెన్నై:  తన మనవడు, మనవరాలు చెప్పినందుకే టీవీకే పార్టీకి ఓటు చేశామని  రూ. 2,500 ఎప్పుడు వస్తాయని ఒక మహిళ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యేను ప్రశ్నించారు. శివగంగ జిల్లాలోని మనమదురై ప్రభుత్వ ఆసుపత్రిని టీవీకే ఎమ్మెల్యే  ఇలంగోవన్‌ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రాథమిక సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న చికిత్సను ఆయన పరిశీలించారు. ఆయన ప్రజలకు అందిస్తున్న  వైద్య సేవల గురించి ఆరా తీశారు. 

తనిఖీ సమయంలో, మునియమ్మల్‌ అనే ఒక రోగి ఎమ్మెల్యేను ఇలా అడిగారు, ‘నా మనవడు, మనవరాలు అందరూ మీకు ఓటు వేయమని నన్ను అడిగారు.  అందుకే  మీకు ఓటు వేశాము. మేము కూడా  మీరు  రూ. 2,500 ఎప్పుడు ఇస్తారని  ఎదురుచూస్తున్నాం అని అడిగారు.’ దీనికి ప్రతిస్పందనగా, ఎమ్మెల్యే ఇలంగోవన్, ‘ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,500 కంటే  కూడా యువతకు ఉద్యోగాలు కల్పించడమే ముఖ్యం’ అని చెప్పారు. ఇది విని మునియమ్మాల్‌ నిరాశ చెందారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement