వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్.. క్రియేటివిటీతో పిచ్చెక్కించారు | Wedding Invitation Inspired Malayalam Movie Minnal Murali Goes Video Viral | Sakshi
Sakshi News home page

Minnal Murali Wedding Invitation: వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్.. క్రియేటివిటీతో పిచ్చెక్కించారు

Jan 13 2022 3:53 PM | Updated on Jan 13 2022 5:10 PM

Wedding Invitation Inspired Malayalam Movie Minnal Murali Goes Video Viral - Sakshi

Minnal Murali Wedding Invitation: మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన రోజులు కొన్ని ఉంటాయి. ఇక ఆ రోజులని ఎప్పటికీ గుర్తుండి పోవాలని ఏవేవో చేస్తుంటాం .అలాంటి రోజుల్లో ఒకటే పెళ్లి రోజు. ఇటీవల వివాహ వేడుకలను చూస్తే.. వధూవరులు తమ వివాహ వేడుక సంథింగ్ స్పెషల్ గా జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్, వెరైటీ ఇన్విటేషన్, సంగీత్ ఇలా ఒక్కటేమిటి అన్నిట్లో ప్రత్యేకతని కోరుకుంటున్నారు. తాజాగా ఓ సినిమా క్యారెక్టర్ లోని పాత్రో పెళ్ళికొడుకు  ఉండి.. పెళ్లి కూతురితో కలిసి చేసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇటీవల మలయాళంలో విడుదలైన  'మిన్నాళ్ మురళి' చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అంతే గాక ఇది మలయాళంలో ప్రేక్షకులతో పాటు ఇతర భాషలోనీ సినీ ప్రేమికులకు కూడా విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా గురించి  చెప్పాలంటే మిన్నాళ్ మురళి.. ఇండియన్ సూపర్ మ్యాన్. ఈ వీడియోలో.. మిన్నాళ్ మురళీ క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టపడిన ఓ వ్యక్తి తన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోలో తానే మిన్నాళ్ మురళిగా గెటప్ వేసు కొని తనకు కాబోయే భార్యను రౌడీల నుండి రక్షించి, తన దరికి ప్రమాదం రానివ్వకుండా ఎప్పుడు తన వెంటే ఉండి తనను కాపాడుకుంటూ ప్రేమలో పడేస్తాడు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీడియో కాన్సెప్ట్ రూపొందించిన వాడిని క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. వాట్ ఏ క్రియేటివిటీ అంటూ కితాబుల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement