మావోయిస్టుల కీలక ప్రకటన: రాకేశ్వర్‌ను విడిచిపెడతాం

We Will Be Release Rakeshshwar Singh Says Maoists Committe - Sakshi

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు కమిటీ స్పందించింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసులతో జరిగిన దాడిలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని ప్రకటించింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మాపై దాడికి యత్నించాయని తెలిపింది. మావోయిస్టులను పూర్తిగా నియంత్రించేందుకు ప్లాన్ వేశారని పేర్కొంది. పోలీసులు మాకు శత్రువులు కాదు అని మరోసారి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పోలీసు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు మావోయిస్టు కమిటీ ప్రకటనలో తెలిపింది. బందీగా ఉన్న రాకేశ్వర్‌ సింగ్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. మధ్యవర్తుల పేర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తే రాకేశ్వర్‌ను అప్పగిస్తామని ఆ ప్రకటనలో మావోయిస్టులు పేర్కొన్నారు. అప్పటివరకు తమ దగ్గరే రాకేశ్వర్‌ సురక్షితంగా ఉంటాడని మావోయిస్ట్ కమిటీ స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top