
న్యూఢిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాల్లో సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు ఓటర్ల జాబితా సవరణ వేళ కొత్తగా ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం రాకపోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) 2002 నుంచి 2004 ఏడాది మధ్యలో జరిగింది. తదుపరి ఎస్‌ఐఆర్‌కు ఈ సంవత్సరాలనే కటాఫ్ తేదీగా పరిగణించబోతున్నారు.
దేశ వ్యాప్తంగా ఎస్‌ఐఆర్ నిర్వహణపై ఈసీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాదిలోపే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తిచేసే అవకాశముంది. రాష్ట్రాలవారీగా చివరి ఎస్‌ఐఆర్ తర్వాత అక్కడి ఓటర్ల జాబితాను ముద్రించే సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ)లకు ఆదేశాలు వెళ్లాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్ సహా కొన్ని రాష్ట్రాల సీఈఓలు ఇప్పటికే ముద్రిత జాబితాను తమ వెబ్‌సైట్‌లలో అందుబాటులోకి తెచ్చారు. కటాఫ్ ఏడాది తర్వాత వచ్చి చేరిన కొత్త ఓటర్లను ఓటు గుర్తింపు రుజువు పత్రాలు అడగనున్నారు. చాలా రాష్ట్రాల్లో మెజారిటీ ఓటర్లపై ఈసీ అభిప్రాయం