Watch: UP Police Shocked After Stopping Auto Rickshaw With 27 Passengers, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లిన ఆటో.. ఛేజ్‌ చేసి ఆపి చూసిన పోలీసులకు షాక్‌

Jul 11 2022 2:26 PM | Updated on Jul 11 2022 5:14 PM

VIral: Police shocked after stopping auto rickshaw with 27 passengers - Sakshi

జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతున్న ఆటోను ఆపి మరీ చూసిన పోలీసులకు పెద్ద షాకే తగిలింది. 

వైరల్‌: ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం. అంతేనా.. మరో ఏడాదిలో మన జనాభా.. చైనా జనాభాను అధిగమించి ప్రపంచంలో నెంబర్‌ వన్‌ స్థానానికి ఎదగబోతోందని సర్వేలు వెల్లడించాయి కూడా. అదే సమయంలో సోషల్‌ మీడియాలో జనాభా పెరుగుదల మీద ఇవాళ రకరకాల చర్చలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో ఆసక్తికరంగా మారింది.

రోడ్డు మీద ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు.. స్పీడ్‌ గన్‌ వేగాన్ని మించి దూసుకుపోయిన ఓ ఆటో కనిపించింది. దీంతో ఆ ఆటోను ఛేజ్‌ చేశారు పోలీసులు. ఎట్టకేలకు దానిని ఆపి.. అందులోంచి ప్యాసింజర్లను దించే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 27 మంది(డ్రైవర్‌తో పాటు) ప్రయాణికులు దిగారు ఆ ఆటో నుంచి.  

ఇంకేం షాక్‌ కావడం పోలీసుల వంతు అయ్యింది. ఇది ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేకున్నా.. ఉత్తర ప్రదేశ్‌ ఫతేపూర్‌ బిండ్‌కీ కోట్వాలి రీజియన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నపిల్లలను పెద్దలతో కలిపి కుక్కేసి మరీ ఆ త్రీవీలర్‌లో తీసుకెళ్లే యత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. అశ్విని ఉపాధ్యాయ అనే ట్విటర్‌ యూజర్‌ దానిని పోస్ట్‌ చేయగా.. విపరీతమైన లైకులు,షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement