మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు | Venkaiah Naidu India Former Vice President Birthday | Sakshi
Sakshi News home page

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Jul 1 2024 11:55 AM | Updated on Jul 1 2024 1:33 PM

Venkaiah Naidu India Former Vice President Birthday

న్యూఢిల్లీ: ఈరోజు(జూలై 1) భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారం ‘ఎక్స్‌’లో మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ   ఆయన జీవితంలో పాటించిన నిబద్దతను కొనియాడారు.

‘వెంకయ్య నాయుడు గారు 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఆయనకు దీర్ఘాయువు, ఆరోగ్యం కలగాలని ప్రార్ధిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. బీజేపీ నేత వెంకయ్య నాయుడు 1949, జూలై 1న జన్మించారు. విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి అడుగిడారు. తన రాజకీయ జీవితంలో వెంకయ్య నాయుడు పలు పదవులు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement