కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఖాదర్‌

UT Khader Nominated As Karnataka Assembly Speaker - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా మలయాళీ కాం‍గ్రెస్‌ నేత యూటీ ఖాదర్‌ సోమవారం నామినేట్‌ అయ్యారు. ఆయన మంగళవారం ఉదయం ఈ పదవికి నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌లు అధినేత ఖాదర్‌కు మద్దతుగా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఖాదర్‌ విధాన సభ ఎన్నికల్లో ఐదుసార్లు విజయం సాధించారు.

ఖాదర్‌ నేపథ్యం..
ఆయన కేరళలోని కాసర్‌గోడ్‌లోని ఉప్పల ప్రాంతానికి చెందినవాడు. మూలాలు కాసర్‌గోడ్‌లో ఉన్నప్పటికీ పుట్టి పెరిగింది అంతా మంగళూరులోనే. ఖాదర్‌ గత కర్ణాటక అసెంబ్లీలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాదర్‌ దాదాపు 22, 790 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సతీష్‌ కుంపలాపై విజయం సాధించారు.

అంతేగాదు అంతకమునుపు  సిద్ధరామయ్య ప్రభుత్వం హయాంలో హౌసింగ్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ అండ్‌ ఆరోగ్యం, ఆహారం పౌర సరఫరాల మంత్రిగా కూడా పనిచేశారు. కాగా, ఖాదర్‌ను స్పీకర్‌గా ప్రతిపాదించడం బట్టి కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ సంఘాల నాయకులకు అవకాశాలు కల్పించడంపై దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ముఖ్యమైన స్థానాల్లో తమ ప్రాతినిధ్యాన్ని కాపాడుకునేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. 

(చదవండి: 'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టిన మహిళ)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top