25 ఏళ్ల తర్వాత.. ‘ఉపహార్‌ కేసు’లో ఇద్దరికి ఏడేళ్ల జైలు | Uphaar Fire Case Delhi Court Sentenced 2 Members 7 Years Jail | Sakshi
Sakshi News home page

25 ఏళ్ల తర్వాత.. ‘ఉపహార్‌ కేసు’లో ఇద్దరికి ఏడేళ్ల జైలు

Nov 9 2021 8:03 AM | Updated on Nov 9 2021 8:06 AM

Uphaar Fire Case Delhi Court Sentenced 2 Members 7 Years Jail - Sakshi

న్యూఢిల్లీ: 1997నాటి ‘ఉపహార్‌’అగ్ని ప్రమాద ఘటన కేసులో రియల్‌ ఎస్టేట్‌ యజమానులు సుశీల్‌ అన్సాల్, గోపాల్‌ అన్సాల్‌లకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. కోర్టు మాజీ ఉద్యోగి దినేశ్‌ చంద్‌కు మరో ఇద్దరు పీపీ బాత్రా, అనూప్‌ సింగ్‌లకు ఏడేళ్ల చొప్పున జైలు శిక్షతోపాటు, రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ పంకజ్‌ శర్మ సోమవారం తీర్పు వెలువరించారు. దోషులకు విధించిన జరిమానాలను బాధితులకు పరిహారంగా చెల్లించనున్నట్లు జడ్జి చెప్పారు.

ఉపహార్‌ సినిమా హాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు సుశీల్, గోపాల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరికీ ఇప్పటికే సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీలో ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ. 30 కోట్ల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించడంతో అనంతరం విడుదల చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement