breaking news
Uphaar fire case
-
25 ఏళ్ల తర్వాత.. ‘ఉపహార్ కేసు’లో ఇద్దరికి ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: 1997నాటి ‘ఉపహార్’అగ్ని ప్రమాద ఘటన కేసులో రియల్ ఎస్టేట్ యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్‌లకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. కోర్టు మాజీ ఉద్యోగి దినేశ్ చంద్‌కు మరో ఇద్దరు పీపీ బాత్రా, అనూప్ సింగ్‌లకు ఏడేళ్ల చొప్పున జైలు శిక్షతోపాటు, రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పంకజ్ శర్మ సోమవారం తీర్పు వెలువరించారు. దోషులకు విధించిన జరిమానాలను బాధితులకు పరిహారంగా చెల్లించనున్నట్లు జడ్జి చెప్పారు. ఉపహార్ సినిమా హాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు సుశీల్, గోపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరికీ ఇప్పటికే సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీలో ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ. 30 కోట్ల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించడంతో అనంతరం విడుదల చేసింది. -
ఉపహార్ కేసు: రియల్టర్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపహార్ థియేటర్ ట్రాజెడీ కేసులో ప్రధాన దోషి రియల్ ఎస్టేట్ వ్యాపారి, గోపాల్ అన్సాల్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏడాది జైలు శిక్ష, రూ. 30 కోట్ల జరిమానాపై అన్సల్ పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం సుప్రీం కొట్టి వేసింది. జైలుకి వెళితే తన ఆరోగ్యంపై కోలుకోలేని దెబ్బపడుతుందన్న గోపాల్ అన్సల్ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మార్చి 20వ తేదీలోపు కోర్టుముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. గతనెలలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం గోపాల్ అన్సల్ కోర్టుముందు లొంగిపోవాల్సి ఉంది. రియల్టర్ల తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ వాదిస్తుండగా, ఉపహార్ విషాద భాదితుల అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది కె టీఎస్ తులసీ తన వాదనలను వినిపించారు. తమ రిప్యూ పిటీషన్ పై సుప్రీం తీర్పుకు సమీక్ష ఉండదని వాదించారు. అయితే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని జె ఎస్ ఖేహర్ ధర్మాసనం విచారణకు జాబితా బెంచ్ లభ్యతపై శుక్రవారం నిర్ధారించనున్నామని సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీకి హామీ ఇచ్చారు. అయితే 1997లో జరిగిన ఉపహార్ సినిమా అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 59 మంది మృతి చెందిన నాటి ఘటనలో థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ సోదరులను దోషులుగా కోర్టు తేల్చింది. వీరిలో గోపాల్ అన్సల్ (69) సుప్రీంకోర్టు ఏడాది జైలుశిక్ష, రూ. 30 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. మరోవైపు సుశీల్ అన్సల్ వయసు ఆధారిత సమస్యల కారణంగా మినహాయింపునిచ్చింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని గోపాల్‌నున ఆదేశించిన సంగతి తెలిసిందే. 2015లో దోషులిద్దరికీ సుప్రీంకోర్టు రెండేండ్ల జైలుశిక్ష (ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా ఉన్నందుకు), చెరొకరికి రూ.30 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2008 డిసెంబర్ 19న ఢిల్లీ హైకోర్టు వారి శిక్షను ఏడాదికి తగ్గించింది. ఈ నేపథ్యంలో మృతుల బంధువుల అసోసియేషన్ దీనిపై న్యాయపోరాటానికి దిగింది. తమకున్యాయం చేయాల్సింది కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు.