శిక్ష కన్నా న్యాయానికి పెద్దపీట వేశాం: కేంద్ర మంత్రి అమిత్‌ షా | Union Home Minister Amit Shah reacts on new criminal laws delhi | Sakshi
Sakshi News home page

శిక్ష కన్నా న్యాయానికి పెద్దపీట వేశాం: కేంద్ర మంత్రి అమిత్‌ షా

Jul 1 2024 2:05 PM | Updated on Jul 1 2024 3:59 PM

Union Home Minister Amit Shah reacts on new criminal laws delhi

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన కొత్త క్రిమినల్‌ చట్టాలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల అమలు ద్వారా శిక్ష కన్న న్యాయానికి పెద్దపీట వేసినట్లు కేంద్ర హోంశాఖ మంతి అమిత్‌ షా తెలిపారు. 

బ్రిటీష్‌ కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)ని భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)గా, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)ని భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఏ)ను భారతీయ సాక్ష్య అధినీయం(బీఎస్‌ఏ)గా మార్చారు. ఈ మూడు చట్టాలపై కేంద్ర మంత్రి అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు.

 

‘మూడు కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని  సెక్షన్లు, చాప్టర్లను తయారు చేయటంలో రాజ్యాంగ స్ఫుర్తికి ప్రాధాన్యం ఇచ్చాం. వాటి ద్వారా మొదటిగా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో సత్వర న్యాయం జరుగుతుంది. అసలు వీటిని ఇంకా ముందు నుంచి అమల్లోకి తీసుకురావాల్సింది. ఒక్క చాప్టర్‌లో  35 సెక్షన్, 13 నిబంధనలు చేర్చాం. 

..గ్యాంగ్‌ రేప్‌ వంటి కేసుల్లో దోషులకు 20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జీవితకాల శిక్ష విధిస్తాం. మైనర్ల అత్యాచారం చేసిన కేసులో మరణశిక్ష విధిస్తాం. వేధింపుల కేసులో బాధితుల స్టెట్‌మెంట్‌ను మహిళా అధికారుల సమక్షంలో ఇంటి వద్దనే రికార్డు చేసే నిబంధన తీసుకువచ్చాం. ఆన్‌లైన్‌ కూడా ఎఫ్‌ఐఆర్‌  నమోదు చేసుకోవచ్చు. దీని వల్ల బాధిత మహిళలు చాలా ఇబ్బందుల నుంచి బయటపడతారు’ అని కేంద్ర మంత్రి అమిత్‌ షా వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement